ఎక్స్‌ప్రెస్‌ రాజా.. అలాగే దాచుకున్నారు

ఎక్స్‌ప్రెస్‌ రాజా.. అలాగే దాచుకున్నారు

సంక్రాంతికి రిలీజైన బడా సినిమాల మీదికి తొడ కొట్టి రేసులో నిలిచాడు శర్వానంద్‌. అతడి సాహసం మంచి ఫలితాన్నే ఇస్తోంది. సంక్రాంతి సినిమాల్లో అత్యంత వేగంగా బ్రేక్‌ ఈవెన్‌ కాబోతున్న సినిమా ఇదే కానుంది. ఇప్పటికే 'ఎక్స్‌ ప్రెస్‌ రాజా' వసూళ్లు రూ.5 కోట్లు దాటాయి. నాలుగు రోజుల తొలి వీకెండ్లో ఈ సినిమా రూ.4 కోట్ల దాకా వసూలు చేసింది. వీక్‌ డేస్‌ లో కూడా శర్వా సినిమా మంచి వసూళ్లే రాబడుతోంది. చాలా ఏరియాల్లో బయ్యర్లు రెండో వీకెండ్లో లాభాలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందు రిలీజైన థియేటర్ల కంటే తర్వాత 50 పెరగడం విశేషం.

నైజాం ఏరియాలో ఆరో రోజు మధ్యాహ్నానికి రూ.2 కోట్ల షేర్‌ మార్కును దాటింది 'ఎక్స్‌ ప్రెస్‌ రాజా'. అంటే డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసినట్లే అన్నమాట. మిగతా బయ్యర్లు కూడా ఒకటి రెండు రోజుల్లో లాభాలు అందుకుంటారు. మరోవైపు ఈ నెల 22 నుంచి కర్ణాటక, తమిళనాడు సహా మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

సినిమాకు మంచి టాక్‌ ఉన్న నేపథ్యంలో అక్కడ వసూళ్లు బాగానే ఉంటాయని ఆశిస్తున్నారు. మరోవైపు 'ఎక్స్‌ ప్రెస్‌ రాజా' శాటిలైట్‌ రైట్స్‌ ముందే అమ్ముడైనట్లు వచ్చిన వార్తలు అబద్ధమని తేలింది. యువి క్రియేషన్స్‌ సంస్థ ఇంకా రైట్స్‌ ఎవరికీ అమ్మలేదట. అలాగే దాచుకున్నారు. ఇప్పుడీ సినిమాకు మంచి టాక్‌ వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ ప్రైస్‌ కి రైట్స్‌ అమ్మే అవకాశాలున్నాయి. ఈ బేనర్లో శర్వా చేసిన గత సినిమా 'రన్‌ రాజా రన్‌'కు రూ.4 కోట్ల ప్రైస్‌ రావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు