ప్రభాస్‌ రొమాన్స్‌ చేసినా చూస్తారు

ప్రభాస్‌ రొమాన్స్‌ చేసినా చూస్తారు

'బాహుబలి'లాంటి భారీ చిత్రంలో నటించేసిన ప్రభాస్‌ని ఇకపై ప్రేక్షకులు అలాంటి సినిమాల్లోనే చూడాలని అనుకుంటారని, ఇక మీదట అతను వర్షంలాంటి ప్రేమకథలు చేయలేడని వస్తోన్న కామెంట్లని అతని పెదనాన్న రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు తోసిపుచ్చారు. ప్రేక్షకులు ఎప్పుడూ ఒకే తరహా పాత్రల్లో హీరోలని చూడాలని అనుకోరని, తనకి రెబల్‌స్టార్‌ ఇమేజ్‌ వచ్చిన తర్వాతే ఒక్క ఫైట్‌ కూడా లేని అమరదీపం చిత్రం చేసానని, భక్తకన్నప్పలాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించానని, అయినా ప్రేక్షకులు ఆదరించారని గుర్తు చేసారు.

ప్రభాస్‌తో ఒక ఎమోషనల్‌ రొమాంటిక్‌ స్టోరీతో సినిమా చేయాలని వుందని, ప్రస్తుతం అలాంటి కథల కోసమే అన్వేషిస్తున్నానని, మంచి కథ దొరికితే బాహుబలి 2 తర్వాత గోపీకృష్ణా బ్యానర్లో ప్రభాస్‌తో ఆ చిత్రం వుంటుందని ఆయన చెప్పారు. అలాగే ప్రభాస్‌కి ఈ ఏడాదిలోనే పెళ్లి చేద్దామని అనుకుంటున్నామని, అతనికి నప్పే అమ్మాయి కోసం చూస్తున్నామని, ప్రభాస్‌ కూడా పెళ్లికి సిద్ధమని చెప్పాడని కృష్ణంరాజు తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ జూన్‌తో నటుడిగా యాభై వసంతాలు పూర్తి చేసుకోబోతున్నానని, ఆ వేడుకలని అభిమానులు ఘనంగా నిర్వహించదలచుకున్నారని ఆయన తెలియజేసారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు