బాలయ్య కోసం స్టోరీ రెడీ చేసిన హీరో

బాలయ్య కోసం స్టోరీ రెడీ చేసిన హీరో

రౌడీ ఇన్‌స్పెక్టర్‌.. లారీ డ్రైవర్‌.. సమర సింహారెడ్డి.. నరసింహ నాయుడు.. నందమూరి బాలకృష్ణ కెరీర్లో బ్లాక్‌ బస్టర్లుగా నిలిచిన ఈ సినిమాలన్నింటికీ రచయితలు పరుచూరి బ్రదర్సేనన్న సంగతి తెలిసిందే. ఐతే 'లక్ష్మీనరసింహా' సినిమాతో బాలయ్య-పరుచూరి బంధానికి తెరపడిపోయింది. మళ్లీ వీళ్లు కలిసి పని చేయలేదు.

మళ్లీ బాలయ్య కోసం కొన్ని కథలు తయారు చేసినా వాటిని బాలయ్య అంగీకరించలేదు. ఐతే తన కెరీర్లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్లు అందించారన్న అభిమానం మాత్రం బాలయ్యకు వారి మీద ఉంది. ప్రస్తుతం పరుచూరి సోదరులు సినిమాలు బాగా తగ్గించేశారు. వాళ్లిద్దరూ దాదాపుగా రిటైరైపోయారనే చెప్పాలి.

ఐతే పరుచూరి బ్రదర్స్‌ కలాలు పక్కనబెట్టిసినా.. అదే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో రచయిత వస్తున్నాడు. ఆ రచయిత టార్గెట్‌ కూడా బాలయ్యే. ఆ రచయిత మరెవరో కాదు.. పరుచూరి రవీంద్ర. పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడైన రవీంద్ర.. గతంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు.

'జంక్షన్‌' అనే సినిమాలో హీరోగా కూడా చేశాడు. ఐతే ఆ సినిమా అతడికి పేరు తేలేదు. ప్రస్తుతం రవీంద్ర బాలయ్య కోసం పవర్‌ ఫుల్‌ స్టోరీ ఒకటి రెడీ చేశాడట. ఇది హిస్టారికల్‌ బ్యాగ్రౌండ్లో తయారు చేసిన కథ అట,. తండ్రి, బాబాయి సిఫారసుతో రవీంద్ర.. బాలయ్యను కలసి కథ కూడా చెప్పాడట. బాలయ్య కూడా కథ విని బాగుందన్నాడట. ఐతే సినిమా చేసేది లేనిది.. ఇంకా కన్ఫమ్‌ చేయలేదట. ఐతే ప్రస్తుతం వందో సినిమా హడావుడిలో ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత బాలయ్య ఈ సినిమా చేసే అవకాశముందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు