స్పీడు మీదున్నాడు రాజా

స్పీడు మీదున్నాడు రాజా

మూడు పెద్ద సినిమాలతో పోటీ పడిన 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' ఓపెనింగ్స్‌ ఆశాజనకంగా లేకపోయినా కానీ మంచి టాక్‌ రావడంతో లేట్‌గా అయినా స్పీడ్‌ అందుకుంది. మొదటి రెండు రోజులు కాస్త డల్‌గా కనిపించిన ఈ చిత్రం మూడో రోజు నుంచి పికప్‌ అయింది. అక్కడ్నుంచి ఈ చిత్రం స్పీడ్‌ తగ్గడం లేదు. శని, ఆదివారాల్లో కలెక్షన్లు బాగా రావడంతో బయ్యర్లకి, నిర్మాతలకి నమ్మకం పెరిగింది. సోమవారం ఉదయం కూడా సోగ్గాడే చిన్నినాయనా తర్వాత ఎక్స్‌ప్రెస్‌ రాజా కలెక్షన్ల ట్రెండే ఆశాజనకంగా వుంది. దీంతో ఈ చిత్రం స్టాండ్‌ అయిపోయినట్టే అనిపిస్తోంది.

రెండవ వారంలో పోటీ వుండదు కాబట్టి ఎక్స్‌ప్రెస్‌ రాజా మంచి రేంజ్‌కి చేరుకునే అవకాశముంది. శర్వానంద్‌ కెరియర్‌లో అత్యధిక షేర్‌ వసూలు చేసిన రన్‌ రాజా రన్‌ కంటే దీనికి ఎక్కువ కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. పది కోట్ల షేర్‌ వస్తుందని ట్రేడ్‌ సర్కిల్స్‌ చెబుతున్నాయి కనుక ఎక్స్‌ప్రెస్‌ రాజాని హిట్‌ ఖాతాలో వేసేసుకోవచ్చు. యు.వి. క్రియేషన్స్‌ సంస్థకి వున్న ట్రాక్‌ రికార్డ్‌ని ఈ చిత్రం నిలబెట్టింది. భారీ చిత్రాల మధ్యన విడుదల చేసిన నిర్మాతల ధైర్యానికి తగ్గ ఫలితమే వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు