నాగార్జున అన్న అనే ఒకే ఒక్కడు

నాగార్జున అన్న అనే ఒకే ఒక్కడు

నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లను తెలుగు పరిశ్రమకు రెండు కళ్లుగా భావిస్తారు సినీ జనాలు. ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ మంచి స్నేహితులుగా మెలగడం వాళ్లిద్దరకే చెల్లింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల వారసులు కూడా ఆ స్నేహాన్ని కొనసాగించారు. ఒకరినొకరు అన్నదమ్ముల్లా భావించారు. ఐతే బాలయ్యతో బంధం ఎందుకు చెడిందో తెలియదు కానీ.. హరికృష్ణతో, అతడి కొడుకులతో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో ఎన్టీఆర్‌తో ఓ ఎపిసోడ్‌ చేసిన సందర్భంగా అతడి ఫ్యామిలీతో తన అనుబంధం గురించి వెల్లడించాడు నాగ్‌.

''మీ ఫ్యామిలీలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా'' అంటూ ఎన్టీఆర్‌ను అడిగిన నాగ్‌.. తర్వాత ''మీ నాన్న హరికృష్ణే'' అని చెప్పాడు. అలాగే కంటిన్యూ చేస్తూ.. ''హరికృష్ణ గారంటే ముందు నుంచి నాకిష్టం. ఇద్దరం కలిసి సీతారామరాజు సినిమా చేశాక ఆ ఇష్టం మరింత పెరిగింది. ఇద్దరం బాగా క్లోజ్‌ అయ్యాం. నేను నా జీవితంలో అన్న అని పిలిచేది ఒక్క హరికృష్ణ గారినే. నా అన్నయ్య వెంకట్‌ను కూడా అన్న అనను. వెంకట్‌ అనే పిలుస్తా. కానీ హరికృష్ణ గారిని మాత్రం అన్న అంటాను. ఆయన కూడా నన్ను తమ్ముడూ అంటారు. కళ్యాణ్‌ రామ్‌ అన్నా కూడా నాకిష్టం. అతను చాలా ఎమోషనల్‌'' అని చెప్పాడు నాగ్‌. మధ్యలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. సీతారామరాజు షూటింగ్‌ సందర్భంగా తన తండ్రి, నాగార్జునల మధ్య బంధాన్ని తాను ప్రత్యక్షంగా చూశానన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు