రాజమౌళి ఫాదర్‌.. అవార్డు పట్టేశాడు

రాజమౌళి ఫాదర్‌.. అవార్డు పట్టేశాడు

విజయేంద్ర ప్రసాద్‌.. గత ఏడాది దేశవ్యాప్తంగా మార్మోగిపోయిన పేరిది. వారం వ్యవధిలో రెండు బిగ్‌ బ్లాక్‌బస్టర్లను అందించిన  ఘనుడాయన. బాహుబలి, భజరంగి భాయిజాన్‌ సినిమాల కథకుడిగా దేశ్యవాప్తంగా ఆయన గురించి చర్చ జరిగింది. బాహుబలి అనేది రాజమౌళి సినిమా కాబట్టి దానికి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించడంలో పెద్ద విశేషం లేదు.

కానీ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ కోసం ఆయన కథ రాయడం.. దాన్ని కబీర్‌ ఖాన్‌ లాంటి పెద్ద దర్శకుడు తీసుకుని సినిమా తెరకెక్కించడం.. 'భజరంగి భాయిజాన్‌' అద్భుత విజయం సాధించి, బాలీవుడ్లో వచ్చిన గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోవడం.. ఇవన్నీ బాలీవుడ్‌ జనాలకు ఆశ్చర్యం కలిగించాయి. దీంతో ఆయన పేరు దేశమంతా మార్మోగింది. ఒకరకంగా పెద్దాయన బాలీవుడ్‌ రచయితలకు కొంత అసూయ కూడా పుట్టించాడు. ఇప్పుడు అక్కడి రచయితలు విజయేంద్ర ప్రసాద్‌ను చూసి మరింత ఏడ్చే పరిణామం జరిగింది.

గత ఏడాదికి ప్రకంటించిన ఫిలిం ఫేర్‌ అవార్డుల్లో విజయేంద్ర ప్రసాద్‌ ఉత్తమ కథకుడిగా ఎంపికయ్యాడు. ఇలా ఓ సౌత్‌ ఇండియన్‌ బాలీవుడ్‌ సినిమాకు బెస్ట్‌ స్టోరీ రైటర్‌గా ఎంపికవడం అరుదైన విషయం. ఇది మన తెలుగువాళ్లు గర్వించదగ్గ విషయం. ఇదే ఊపులో విజయేంద్ర ప్రసాద్‌ నేషనల్‌ అవార్డు కూడా గెలిచేయాలని ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు