సునీల్‌ కబ్జా చేసేశాడు

సునీల్‌ కబ్జా చేసేశాడు

'తడాఖా' చిత్రంలో నాగచైతన్యకి సపోర్టింగ్‌ రోల్‌ చేస్తున్నాడని అనుకున్న సునీల్‌ ఫస్టాఫ్‌ వరకు అదే చేశాడు. నాగచైతన్యకే ఈ చిత్రంలో సోలో సాంగ్స్‌ అన్నీ ఇచ్చారు. ఇద్దరి కాంబినేషన్‌ సాంగ్స్‌లో కూడా సునీల్‌ని పక్కన పెట్టారు.

అయితే సినిమాలో ఓ ఇరవై నిముషాల పాటు సునీల్‌కి ఫుల్‌ సీన్‌ ఇచ్చారు. యాక్షన్‌ సీన్స్‌లో సునీల్‌ని హైలైట్‌ చేశారు. హీరో ఎలివేషన్‌ సీన్స్‌ అన్నీ కూడా సునీల్‌కే పెట్టారు. దాంతో ఆ కాస్త సమయంలోనే తడాఖా సినిమాకి సునీల్‌ హీరో అయిపోయాడు. ఆ సమయంలో నాగచైతన్య క్యారెక్టర్‌ని డౌన్‌ చేయడం వల్ల సునీల్‌ లైమ్‌ లైట్‌లోకి వచ్చేశాడు.

చివరిగా ఈ చిత్రంలో చైతన్య కంటే సునీలే ఎక్కువ గుర్తుంటాడు. ఇంతవరకు సునీల్‌కి ఎవరూ ఇంత బిల్డప్‌, ఇంత ఎలివేషన్‌ ఇవ్వలేదు. తడాఖా విజయంలో సునీల్‌కి లయన్‌ షేర్‌ ఇచ్చే లెవల్లో అతను సూపర్బ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు