ఎక్స్‌ప్రెస్‌ రాజా కాన్ఫిడెన్స్‌ ఏంటంటే..

ఎక్స్‌ప్రెస్‌ రాజా కాన్ఫిడెన్స్‌ ఏంటంటే..

సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా.. ఏమాత్రం భయపడకుండా 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'ను విడుదల చేసేస్తోంది యువి క్రియేషన్స్‌ సంస్థ. సినిమా మీద ఎంత నమ్మకముంటే మాత్రం.. ఇంత పోటీలోనూ రిలీజ్‌ చేయడమేంటి అన్న సందేహాలు కలుగుతున్నాయి జనాలకు. ఇది చాలా పెద్ద రిస్క్‌ అన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

ఐతే సినిమా ఫస్ట్‌ కాపీ చూశాక కొందరు ప్రముఖులు ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌తోనే యువి క్రియేషన్స్‌ వాళ్లు ధైర్యంగా తమ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేయడానికి రెడీ అయిపోయినట్లు తెలిసింది. ఆ ప్రముఖుల్లో డైరెక్టర్‌ మారుతి, నిర్మాత దిల్‌ రాజు లాంటి వాళ్లున్నారు. ఆ ఇద్దరూ సినిమా చూసి ఫిదా అయిపోవడమే కాదు.. డిస్ట్రిబ్యూషన్‌ కూడా తీసుకున్నారు.

దీని గురించి మారుతి మాట్లాడుతూ.. ''యువీ క్రియేషన్స్‌ అంటే నాకు మొదటి నుంచి మంచి అభిమానం. క్వాలిటీ సినిమాలు తీస్తారు. వంశీ, ప్రమోద్‌ మంచి టేస్టున్న నిర్మాతలు. 'భలే భలే మగాడివోయ్‌'తో మా మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ అనుబంధంతోనే 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' తొలి కాపీని నాకు చూపించారు వంశీ.  సినిమా చూస్తూ చాలా ఎంజాయ్‌ చేశా. వినోదం నాకు బాగా నచ్చింది. దాంతో నేను, నా మిత్రులు కలసి కృష్ణా జిల్లాలో పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాం'' అని వెల్లడించాడు. సంక్రాంతికి ఓ వైపు 'డిక్టేటర్‌' సినిమాను పంపిణీ చేస్తూ కూడా దిల్‌ రాజు నైజాం ఏరియాకు 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' హక్కులు తీసుకోవడాన్ని బట్టి కూడా ఈ సినిమా ఔట్‌పుట్‌పై అతడికి ఎంత కాన్ఫిడెన్స్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు