చరణ్‌ సినిమా.. ఇంకా ఖాయం కాలేదు

చరణ్‌ సినిమా.. ఇంకా ఖాయం కాలేదు

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' లాంటి సూపర్‌ హిట్‌ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు మేర్లపాక గాంధీ. తొలి సినిమా తర్వాత తొందరపడకుండా రెండేళ్లు విరామం తీసుకుని 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీ ఉన్నా ధైర్యంగా ఈ చిన్న చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారంటే దాని మీద నిర్మాతలకు ఎంత గురి ఉందో అర్థం చేసుకోవచ్చు. 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' చూసిన జనాల ఫీడ్‌ బ్యాక్‌ తెలుసుకుని మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. గాంధీతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడని.. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఈ ఏడాదే సినిమా మొదలుకావచ్చని ప్రచారం జరుగుతోంది టాలీవుడ్లో.

ఈ సంగతే గాంధీ దగ్గర ప్రస్తావిస్తే.. ఔననీ అనలేదు కాదనీ అనలేదు. ''రామ్‌ చరణ్‌తో సినిమా ఇంకా ఖరారు కాలేదు. అయితే కచ్చితంగా ఆయనతో సినిమా చేయాలనే అనుకుంటున్నా. కానీ అదే నా తర్వాతి ప్రాజెక్టు అని మాత్రం అనుకోలేదు. నా తర్వాతి సినిమాను యువి క్రియేషన్స్‌కే చేయాలని మాత్రం ఫిక్స్‌ అయ్యాను'' అని చెప్పాడు గాంధీ.

'ఎక్స్‌ప్రెస్‌ రాజా' విశేషాల గురించి చెబుతూ.. ''చాలా కొత్త రకమైన పాత్రలతో రాసుకున్న ఎంటర్టైనింగ్‌ లవ్‌ స్టొరీ ఎక్స్‌ ప్రెస్‌ రాజా. సినిమాలో ప్రతి 15 నిమిషాలకి ఓ కొత్త పాత్ర వస్తుంటుంది. ఆ పాత్రకి హీరోకి ఉన్న లింక్‌ ఏంటి అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. హాలీవుడ్‌ మూవీ వింటేజ్‌ పాయింట్‌ తరహా స్క్రీన్‌ ప్లేతో సాగుతుంది. ఈ సినిమా మొత్తంలో 5 స్టోరీలు లింక్‌ అయ్యి ఉంటాయి'' అని చెప్పాడు గాంధీ. 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' కథను శర్వాను ఉద్దేశించి రాయలేదని.. స్క్రిప్టు పూర్తయ్యాక అతడికి చెబితే ఓకే అన్నాడని.. యువి క్రియేషన్స్‌లో చేద్దామంటే అతనే వాళ్లతో మాట్లాడి సినిమా సెట్‌ చేశాడని గాంధీ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English