సంచలనానికి ఏడాది నిండింది

సంచలనానికి ఏడాది నిండింది

పవన్‌కళ్యాణ్‌నుంచి పదేళ్ల కాలంగా ఎదురు చూసిన బ్లాక్‌బస్టర్‌ని 'గబ్బర్‌సింగ్‌' అందించింది. గత ఏడాది ఇదే రోజు రిలీజ్‌ అయిన గబ్బర్‌సింగ్‌ ఓపెనింగ్స్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. అత్యంత వేగంగా యాభై కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్రకెక్కింది. అరవై మూడు కోట్లకి పైగా షేర్‌తో ఆల్‌టైమ్‌ హిట్స్‌లో మగధీర తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది.

ఖుషీ తర్వాత పదకొండేళ్ల పాటు అభిమానులు ఎదురు చూసిన ఘన విజయం ఈ చిత్రంతోనే దక్కింది. దాంతో అభిమానులు అదే పనిగా రిపీట్‌గా ఈ చిత్రాన్ని వీక్షించారు. దేవిశ్రీప్రసాద్‌ పాటలు ప్రభంజనమయ్యాయి. హరీష్‌ శంకర్‌ మాటలు చిన్న పిల్లల నోట్లో నానాయి. నిర్మాత బండ్ల గణేష్‌ ఓవర్‌నైట్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ అయిపోయాడు.

ఈ చిత్రానికి సీక్వెల్‌ తీసే పనిలో పవన్‌ నిమగ్నమయ్యాడు. త్వరలోనే గబ్బర్‌సింగ్‌ 2 సెట్స్‌ మీదకి వెళ్లనుంది. మొదటి సినిమా సృష్టించిన ప్రభంజనం వల్ల సీక్వెల్‌పై అంచనాలు స్కై లెవల్లో ఉంటాయి. మరి గబ్బర్‌సింగ్‌ 2 ఏ స్థాయిలో సక్సెస్‌ అవుతుందనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు