శైలజ... ఏలుకుంటోంది

శైలజ... ఏలుకుంటోంది

సినిమాకు ఎంత పాజిటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. క్లాస్‌ సినిమా కదా కలెక్షన్లు ఓ మోస్తరుగానే ఉంటాయనుకున్నారు కానీ.. ఆ అంచనాలకు భిన్నంగా 'నేను శైలజ' వసూళ్లు కుమ్మేస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రతి నెలా అందరి ఆమోదం పొందే సినిమా వచ్చింది. కానీ చివరి నెల డిసెంబర్లో మాత్రం ఓ మోస్తరు సినిమాలే వచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ను మెప్పించే సినిమా వచ్చి చాలా కాలమైంది. ఇది 'నేను శైలజ'కు అడ్వాంటేజీగా మారి.. ఆ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్‌? లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. వీకెండ్‌ తర్వాత కూడా కలెక్షన్లలో పెద్దగా డ్రాప్‌ కనిపించలేదు. నిర్మాత, పీఆర్వో బీఏ రాజు ఇచ్చిన వసూళ్ల లెక్కల ప్రకారం మంగళవారం మ్యాట్నీ, ఫస్ట్‌ షోలకు 'నేను శైలజ' థియేటర్లలో హౌస్‌ ఫుల్స్‌ పడ్డాయి. వీక్‌ డేస్‌ లో ఇలా హౌస్‌ ఫుల్స్‌ పడ్డం గొప్ప విషయమే. యుఎస్‌ లో ఈ సినిమా ఇప్పటికే హాఫ్‌ మిలియన్‌ మార్కు దాటేసింది.

నైజాంలో 4 కోట్ల షేర్‌ మార్కుకు చేరువవుతోంది. మొత్తంగా 'నేను శైలజ' ఇప్పటికే రూ.15 కోట్ల మార్కుకు చేరువగా ఉంది. ఈ వారాంతం వర్మ సినిమా కిల్లింగ్‌ వీరప్పన్‌ మాత్రమే విడుదలవుతోంది. అది ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చే సినిమా. సంక్రాంతి వరకు ఇంకే పోటీ ఉండదు కాబట్టి రెండో వారాంతం కూడా 'నేను శైలజ' కలెక్షన్లు బాగానే దండుకునే అవకాశముంది. ఫుల్‌ రన్‌ లో ఈ సినిమా రూ.20 కోట్ల షేర్‌ దాటొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English