ప్రభాస్‌ కూడా తిట్టి పోసాడట

ప్రభాస్‌ కూడా తిట్టి పోసాడట

'ఎక్స్‌ప్రెస్‌ రాజా' చిత్రాన్ని సంక్రాంతి గందరగోళంలో విడుదల చేయడం పట్ల యువి క్రియేషన్స్‌ సంస్థ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ప్రదర్శిస్తోందని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. తమ సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్‌ వున్నప్పటికీ, పెద్ద సినిమాలని గౌరవించి, థియేటర్ల సమస్య ఉత్పన్నమవుతుందనే సంగతి గుర్తించి ఈ చిత్రాన్ని వారం రోజులు వెనక్కి జరిపి వుండాల్సిందని చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లు సరైన విధంగా విడుదల చేయలేమని చేతులెత్తేస్తున్నారట. ఓవర్సీస్‌లో అసలు ఈ సినిమాకి సరిపడా థియేటర్లు దొరికేదెలా అంటున్నారట. రన్‌ రాజా రన్‌, యువి క్రియేషన్స్‌ గత చిత్రాల ఫలితాలు చూసి 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'ని మంచి రేట్లకే కొన్నారట. కానీ ఆ డబ్బులు వసూలు కావాలంటే ఇలాంటి పోటీ వాతావరణంలో కుదరకపోవచ్చునని బయ్యర్లు బెంబేలు పడుతున్నారట.

యువి క్రియేషన్స్‌ ప్రభాస్‌ సొంత సంస్థే కావడంతో ఈ గందరగోళం గురించి తెలిసి అతను కూడా ఏమిటిదంటూ వారిని గట్టిగానే మందలించాడట. పెద్ద హీరో సినిమాకి చేసినట్టు ఇంత హడావిడి దేనికని, సంక్రాంతికి విడుదల చేయకపోతే వచ్చే నష్టమేంటని అడిగాడట. తనతో ఈ విషయాన్ని పరిశ్రమకి చెందిన వాళ్లు ప్రస్తావించడంతో, తన సంస్థకి వస్తోన్న అనవసరపు నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌తో ప్రభాస్‌ కోప్పడ్డాడని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ఇంత రిస్కు చేస్తోన్న యువి క్రియేషన్స్‌ తమ సినిమాపై ఎంతటి కాన్ఫిడెన్స్‌ వుందనేది చెప్పకనే చెబుతున్నారు. వారి నమ్మకానికి తగ్గట్టే ఎక్స్‌ప్రెస్‌ రాజా మిగతా పెద్ద సినిమాలని తట్టుకుని గెలుస్తాడో లేడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు