చిరు, చరణ్‌, బన్నీ.. ఒకే వేదికపై

చిరు, చరణ్‌, బన్నీ.. ఒకే వేదికపై

మా ఫ్యామిలీ హీరోలందరం కలిపితే ఒక క్రికెట్‌ టీం తయారు చేయగలిగేంత మంది ఉన్నాం అంటూ చమత్కరించాడు కొన్ని రోజుల కిందట యంగ్‌ మెగా గన్‌ వరణ్‌ తేజ్‌. నీ ఆడియో వేడుకకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రాలేదేంటి అని అడిగితే అతడిచ్చిన సమాధానం ఇది. మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరంటే ఒకరికి పడట్లేదని.. ఎవరి దారిలో వాళ్లు నడుస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌ వేడుకలకు చిరు, చరణ్‌ లాంటి వాళ్లు రాకపోవడం.. చరణ్‌ వేడుకలో బన్నీ సహా ఎవరూ కనిపించకపోవడం.. వరుణ్‌ ఫంక్షన్లలో అతను ఒంటరిగా కనిపిస్తుండటం సందేహాలకు తావిస్తోంది.

ఇలాంటి తరుణంలో చిరంజీవి, చరణ్‌, బన్నీ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగంలో జరిగే అల్లు రామలింగయ్య పురస్కార ప్రదానోత్సవంలో ఈ ముగ్గురూ పాల్గొనబోతున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు అల్లు పురస్కారం అందజేయనున్నారు. ఏటా ప్రదానం చేసే ఈ అవార్డును మెగా ఫ్యామిలీ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. చిరంజీవి ప్రతిసారీ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతాడు. చరణ్‌, బన్నీ కూడా కచ్చితంగా వేడుకలో పాల్గొంటారు. ఈసారి కూడా అల్లు అల్లుడు, మనవళ్లు ఈ వేడుకలో సందడి చేయనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English