ఐతే డిక్టేటరే చివరి సినిమా అన్నమాట

ఐతే డిక్టేటరే చివరి సినిమా అన్నమాట

బాలీవుడ్లో సలీం-జావెద్‌ జంట దశాబ్దాల తరబడి కలిసి రచన సాగించింది. బ్లాక్‌ బస్టర్‌ హిట్లు అందించింది. ఐతే ఇద్దరు రచయితలు ఇలా సమన్వయంతో కలిసి పని చేయడం ఏ ఇండస్ట్రీలో అయినా అరుదే. తెలుగులో అలాంటి వాళ్లు అరుదుగా కనిపిస్తారు. ఈ తరంలో కోన వెంకట్‌, గోపీ మోహన్‌ జంట దశాబ్దం నుంచి ఆ సమన్వయంతోనే సాగుతూ వస్తోంది.

శ్రీను వైట్ల కాంబినేషన్లో వెంకీ, దుబాయ్‌ శీను, రెడీ, కింగ్‌, నమో వెంకటేశ, దూకుడు, బాద్‌ షా, అల్లుడు శీను, లౌక్యం లాంటి హిట్టు సినిమాలొచ్చాయి. కానీ ఈ మధ్య వీళ్ల కాంబినేషన్‌ అంతగా వర్కవుట్‌ కావట్లేదు. 'బ్రూస్‌ లీ' సినిమా ఇద్దరికీ బ్యాడ్‌ నేమ్‌ తీసుకొచ్చింది. మరోవైపు ఇద్దరూ కూడా సొంతంగా సినిమాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోన, గోపీల మధ్య కటీఫ్‌ అయిపోయినట్లేనని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.

కోన ఇప్పటికే సొంత కుంపటి పెట్టుకుని తన స్వీయ దర్శకత్వంలో 'శంకరాభరణం' తీశాడు. త్రిపుర, అఖిల్‌ లాంటి సినిమాలకు గోపీ హ్యాండ్‌ లేకుండా సొంతంగా రచన చేశాడు. ఇకపైనా 'శంకరాభరణం' తరహాలో అన్నీ తానై సినిమాలు చేసుకోవాలనుకుంటున్నాడు. మరోవైపు గోపీ మోహన్‌ చాలా ఏళ్లుగా వాయిదా పడుతున్న తన దర్శకత్వ కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

 తన దర్శకత్వంలో 'ఇష్టంగా సంతోషంగా ఆనందంగా' అనే సినిమాను కూడా అనౌన్స్‌ చేశాడు కూడా. దీని కంటే ముందే కోన హ్యాండ్‌ లేకుండా అతను కూడా 'శౌర్య' సినిమాకు స్క్రిప్టు సమకూర్చిన నేపథ్యంలో ఇద్దరూ ఒకరికొకరు దూరం జరుగుతున్నట్లే కనిపిస్తోంది. కాబట్టి ఇకపై కోన వెంకట్‌, గోపీమోహన్‌ పేర్లను జంటగా చూడలేమేమో. 'డిక్టేటర్‌' సినిమానే వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే చివరి సినిమానేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English