బాలయ్య ఒప్పుకున్నా సినిమా తీయలేదట

బాలయ్య ఒప్పుకున్నా సినిమా తీయలేదట

టాలీవుడ్లో ఓ అప్‌కమింగ్‌ డైరెక్టర్‌కి నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం దక్కితే వద్దు పొమ్మని తిరస్కరిస్తాడా? అది నిజమని నమ్మగలమా? కానీ తాను అలాగే చేశానంటున్నాడు డైరెక్టర్‌ రమేష్‌ వర్మ. 'రైడ్‌' సినిమా విజయవంతమైన అనంతరం తనకు బాలయ్యతో సినిమా చేసే అవకాశం దక్కిందని కానీ.. ఆ ఛాన్స్‌ తనే వదులుకున్నానని అతను చెప్పాడు. తాను బాలయ్యను సరిగా డీల్‌ చేయలేననే భయంతోనే అలా చేశానని అంటున్నాడు రమేష్‌. ఆ కథేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

''నేను వెంట వెంటనే సినిమాలు చేసేయాలనుకోను. నాకు కొంచెం బద్దకం ఎక్కువ. రైడ్‌ హిట్‌ అయ్యాక నేను 'వీర' సినిమా చేశా. ఐతే అది కాకుండా ఓ లవ్‌ స్టోరీ చేయాల్సింది. బాలయ్య బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఐతే రెండే సినిమాలు చేసిన నేను బాలయ్యతో సినిమా చేయగలనా అనే అనుమానంతో నేనే సినిమా చేయలేనని తప్పుకున్నాను'' అని రమేష్‌ వర్మ తెలిపాడు.

ఇక 'అమ్మాయితో అబ్బాయి' ఎలా మొదలుపెట్టాడో చెబుతూ.. ''బాలయ్యతో సినిమా వద్దనుకున్నాక.. రవితేజ, గోపీచంద్‌ కాంబినేషన్లో బాలీవుడ్‌ హిట్‌ మూవీ 'రేస్‌' రీమేక్‌ చేయాలనుకున్నాను. రీమేక్‌ రైట్స్‌ కూడా తీసుకున్నాను. భవ్య క్రియేషన్స్‌ బేనర్‌ పై ఆనంద్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తానన్నారు. ఐతే ముందు ఓకె చెప్పినా తర్వాత గోపీచంద్‌ నో చెప్పడంతో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్‌ అయింది. ఆ తర్వాత రవితేజతో 'వీర' చేశాను. ఆపై వస్తా నీవెనుక, అబ్బాయితో అమ్మాయి.. ఇలా రెండు కథలు అనుకుని ఇళయరాజా గారికి చెబితే.. ఆయన 'అబ్బాయితో అమ్మాయి'కే ఓకే చెప్పారు. అలా ఈ సినిమా చేశాను'' అని రమేష్‌ వర్మ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు