రవితేజకి భయం స్టార్టయింది

రవితేజకి భయం స్టార్టయింది

మినిమమ్‌ గ్యారెంటీ హీరో నుంచి ఇప్పుడు రవితేజ ఏసీ డీసీ హీరో అయిపోయాడు. ఏ సినిమా వర్కవుట్‌ అవుతుందో, ఏది మిస్‌ఫైర్‌ అవుతుందో అర్థం కావడం లేదు. బలుపు తర్వాత ఫామ్‌లోకి వచ్చాడని అనుకుంటే మళ్లీ రవితేజ నెమ్మదిగా తన మార్కెట్‌ కోల్పోతున్నాడు. ఎవరి మార్కెట్‌ అయినా సినిమా, సినిమాకీ పెరుగుతూ వుండాలి. తెలుగు సినిమా మార్కెట్‌ మునుపటి కంటే పెరిగినా కానీ రవితేజ మార్కెట్‌ మాత్రం క్షీణిస్తోంది. పవర్‌ యావరేజ్‌గా ఆడడం, కిక్‌ 2 ఫ్లాప్‌ అవడంతో బెంగాల్‌ టైగర్‌ని రీజనబుల్‌ రేట్లకే అమ్మారు. కానీ ఆ అమౌంట్‌ కూడా ఫుల్‌గా రికవర్‌ కాక ఇది కూడా యావరేజ్‌ సినిమాగానే మిగిలిపోయింది.

దీంతో ఎలాంటి సినిమాలు చేస్తే తనని చూస్తారనే దానిపై మాస్‌ మహారాజా అయోమయానికి గురవుతున్నాడట. ఆల్రెడీ మొదలైన సినిమాలకి కూడా కథల విషయంలో మరిన్ని మార్పులు చేయాలంటూ సూచిస్తున్నాడట. వచ్చే ఏడాది కనుక ఈ డౌన్‌ ట్రెండ్‌ కొనసాగినట్టయితే తనతో సినిమాలు తీసే నిర్మాతలు కనిపించకుండా పోతారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన రవితేజ ఇప్పుడే మేల్కొని ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English