అతని రేటు నాలుగు రెట్లు పెరిగింది

అతని రేటు నాలుగు రెట్లు పెరిగింది

కమెడియన్‌ పృధ్వీ కనిపిస్తే ఇప్పుడు థియేటర్‌ ఘొల్లుమంటోంది. ఒకప్పుడు బ్రహ్మానందం, సునీల్‌లాంటి కమెడియన్లు కనిపిస్తే వచ్చే రెస్పాన్స్‌ ఇప్పుడితనికి వస్తోంది. ఇండస్ట్రీలో చాలా కాలంగా వుంటున్నా కానీ లౌక్యంతోనే పృధ్వీ దశ తిరిగింది. ఇప్పుడు ప్రతి సినిమాలో అతని సీన్లే హైలైట్‌ అవుతున్నాయంటూ అందరూ మాట్లాడుకుంటూ వుండడంతో పృధ్వీకి డిమాండ్‌ పెరిగింది. గతంలో ఒక రోజు కాల్షీట్‌కి పాతిక నుంచి నలభై వేల వరకు తీసుకునే పృధ్వీ ఇప్పుడు సింగిల్‌ డేకి లక్షన్నర పుచ్చుకుంటున్నాడట. ప్రస్తుతానికి ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌ తక్కువే వున్నా కానీ తనకి డిమాండ్‌ బాగా వుండడంతో పెద్ద క్యారెక్టర్లు రాస్తున్నారట.

ముందు ముందు అతను మూడు లక్షల రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. ఎక్కడైనా గుంపులో నిలబడే అవకాశమొచ్చినా చాలని అనుకునే దశ నుంచి పృధ్వీ ఇప్పుడింతటి స్టార్‌ కమెడియన్‌ అవడానికి చాలా కష్టాలు పడ్డాడు. ఖడ్గంతోనే గుర్తింపు వచ్చినా కానీ నిజంగా డబ్బులు సంపాదించడానికి అతనికి మరో పదేళ్ళకి పైగానే పట్టింది. పృధ్వీ రైజ్‌ అవడంతో బ్రహ్మానందం ప్రాధాన్యత తగ్గిపోతోంది. ఆయన చేస్తున్న సినిమాలు, పాత్రలు కూడా ఫెయిలవుతూ వుండడం పృధ్వీకి మరింతగా కలిసివస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English