హరికృష్ణ చెప్పిన ఎన్టీఆర్‌ సీక్రెట్‌

హరికృష్ణ చెప్పిన ఎన్టీఆర్‌ సీక్రెట్‌

తన కొడుకుల గురించి హరికృష్ణ మాట్లాడ్డం చాలా చాలా తక్కువ. అసలు వాళ్ల ఆడియో ఫంక్షన్లు రావడం కూడా అరుదే. వచ్చినా మాట్లాడరు. ఐతే 'నాన్నకు ప్రేమతో' ఆడియో వేడుకకు రావడమే కాదు.. చాలా ఉత్సాహంగా మాట్లాడారు. ఎన్టీఆర్‌ కు సంబంధించి ఓ సీక్రెట్‌ కూడా చెప్పారాయన.

''మా ఏడుగురు సోదరులకు నాన్నగారే పేర్లు పెట్టారు. మాకందరి పేర్ల వెనుక కృష్ణ ఉంటుంది. ఇక మా సోదరీమణులందరికీ ఈశ్వరి అని వచ్చేలా పేర్లు పెట్టారు. ఇక నా కొడుకుల్లో పెద్ద వాళ్లిద్దరికీ జానకి రామ్‌, కళ్యాణ్‌ రామ్‌ అని పేర్లు పెట్టారు. జూనియర్‌ బాబుకి అదే కోవలో తారక్‌ రామ్‌ అని పేరు పెట్టాను.

ఐతే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చేస్తున్న సమయంలో జూనియర్‌ బాబుని తీసుకురమ్మని కబురు పంపారు. అప్పుడు అతడి పేరేంటి అని అడిగాడు. తారక్‌ రామ్‌ అని చెప్పాను. దానికాయన.. 'నో.. నీది నా అంశ.. నా పేరు నీకు ఉండాలి. అందుకే నీ పేరు నందమూరి తారక రామారావు అని చెప్పారు. అలా తన పేరును ఆయన దానం చేశారు. అంతే కాదు.. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా హిందీ వెర్షన్‌ వరకు జూనియర్‌ బాబుతో భరతుడి క్యారెక్టర్‌ కూడా చేయించారు'' అని హరికృష్ణ వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు