రవితేజకి మళ్లీ టోపీ పెట్టారంట!

రవితేజకి మళ్లీ టోపీ పెట్టారంట!

రవితేజని వరుస పరాజయాలు వేధించినపుడు పారితోషికం తగ్గించేసుకున్నాడు. సినిమా పెట్టుబడి మీద లాభం వచ్చినట్టయితే కనుక దాంట్లో వాటా వచ్చేలా మాట్లాడుకుంటున్నాడు. రవితేజ కండిషన్‌ ప్రకారం హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా నిర్మాతకి కనుక లాభాలొస్తే వాటా ఇవ్వాలట. కానీ అతని సినిమాలు సక్సెస్‌ అవ్వకపోవడంతో నిర్మాతలు కూడా నష్టాలే చూపిస్తూ రవితేజకి మిగతా డబ్బులు ఇవ్వడం లేదట. ఇదే విషయంపై పవర్‌ నిర్మాతతో రవితేజకి గొడవైందని చెప్పుకున్నారు. ఆ తర్వాత కళ్యాణ్‌రామ్‌ నుంచి కూడా 'కిక్‌ 2'కి ఎక్స్‌ట్రా డబ్బులేం రాలేదట. సినిమా వ్యయం ఎక్కువయిందని అతను చెప్పడంతో సురేందర్‌ రెడ్డిపై రవితేజ ఫైర్‌ అయ్యాడట.

ఆ చిత్రం ఫ్లాప్‌ అయినప్పుడు సురేందర్‌ తన మాట వినలేదని రవితేజ పబ్లిక్‌గా కామెంట్‌ చేసిన సంగతి తెలిసిందే. బెంగాల్‌ టైగర్‌ హిట్‌ అవుతుందని అనుకుంటే ఇది కూడా యావరేజ్‌ సినిమాగానే నిలిచింది. ఓవర్‌ఫ్లోస్‌ వస్తాయనే కాన్ఫిడెన్స్‌తో నిర్మాత దీనిని తక్కువకి అమ్మితే ఆ డబ్బులే ఇంతవరకు వసూలు కాలేదట. ఇక ఓవర్‌ఫ్లోస్‌ అనేది అవుటాఫ్‌ క్వశ్చన్‌ కనుక ఇంకోసారి రవితేజ ప్లాన్‌ మటాష్‌ అయినట్టయింది. వరుసగా మూడు సినిమాలకి రవితేజ తన మార్కెట్‌ రేట్‌ కంటే రెండు కోట్లు తక్కువకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పారితోషికం పెంచుదామంటే రీసెంట్‌ సినిమాల ట్రాక్‌ రికార్డ్‌ చూపించి ఇవ్వమని నిర్మాతలు తెగేసి చెప్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English