బాహుబలి గ్రాఫిక్స్‌ అంత చీపా?

బాహుబలి గ్రాఫిక్స్‌ అంత చీపా?

బాహుబలి రెండు భాగాల బడ్జెట్‌ రూ.250 కోట్లని మాత్రం తెలుసు. కానీ తొలి భాగం కోసం ఎంత ఖర్చు పెట్టారు... అందులో విజువల్‌ ఎఫెక్టుల కోసం ఎంత ఖర్చు పెట్టారు.. నటీనటుల పారితోషకాలకు ఎంత ఖర్చయింది. రామోజీ ఫిలిం సిటీకి ఎంత చెల్లించారు.. సెట్టింగుల కోసం ఎన్ని కోట్లు పోశారు అన్న వివరాలేవీ తెలియలేదు. ఐతే ఎట్టకేలకు 'బాహుబలి.. ది బిగినింగ్‌' కోసం విజువల్‌ ఎఫెక్టులకు ఎంత ఖర్చయిందో రాజమౌళి స్వయంగా వెల్లడించాడు. ఫస్ట్‌ పార్ట్‌ వరకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కి రూ.22 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపాడు రాజమౌళి.

ఐతే వెండితెర మీద బాహుబలి విన్యాసాలు చూస్తే మాత్రం ఇందుకు రూ.22 కోట్లే ఖర్చయిందంటే నమ్మడం కష్టమే. ఆ మాత్రం బడ్జెట్‌ తో హాలీవుడ్‌ స్థాయి ఔట్‌ పుట్‌ తెచ్చినందుకు జక్కన్నను అభినందించాల్సిందే. ఐతే 'బాహుబలిలో విజువల్‌ ఎఫెక్టులు అద్భుతం అని తాను అనలేనని.. అవతార్‌, లైఫ్‌ ఆఫ్‌ పై లాంటి సినిమాలతో పోలిస్తే తన సినిమాలో విజువల్‌ ఎఫెక్టులు ఆ స్థాయిలో లేవన్న సంగతి తాను కూడా అంగీకరిస్తానని.. ఐతే ఆ సినిమాలకు మిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తే.. తాము రూ.22 కోట్ల పరిమిత బడ్జెట్‌ తో ఆ స్థాయి క్వాలిటీ తీసుకు రాగలిగినందుకు చాలా ప్రౌడ్‌ గా ఫీలవుతున్నామని చెప్పాడు రాజమౌళి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English