మహేష్‌ హీరోయిన్ని నిందించడం న్యాయమా?

మహేష్‌ హీరోయిన్ని నిందించడం న్యాయమా?

ఒక సినిమా ఫలితంలో హీరో లేదా హీరోయిన్‌ లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్ర ఏముంటుంది? రిజల్ట్‌ తేడా రావడానికి కారణాలు ఇంకేవో ఉన్నప్పటికీ ఫలానా హీరోయిన్‌ ఐరెన్‌ లెగ్‌ అని ముద్ర వేసేయడం ఎంత వరకు న్యాయం? కానీ ఇండస్ట్రీ జనాలు, మీడియా వాళ్లు ఈ అలవాటు తప్పరు.

శ్రుతి హాసన్‌ విషయంలో ఒకప్పుడు ఇలాగే ఐరెన్‌ లెగ్‌ ముద్ర వేశారు. కానీ ఆమే ఇప్పుడు గోల్డెన్‌ లెగ్‌ అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా మారాక కూడా ఇలాంటి కామెంట్లే వినిపించాయి. కానీ ఆయన నటిస్తున్న సినిమాలు కూడా సూపర్‌ హిట్టవుతున్నాయి. అయినప్పటికీ నటీనటులపై ఐరెన్‌ లెగ్‌ ముద్ర వేయడం మానట్లేదు జనాలు.

మహేష్‌ బాబు '1 నేనొక్కడినే'తో హీరోయిన్‌గా పరిచయమైన కృతి సనన్‌పై జనాలు ఐరెన్‌ లెగ్‌ ముద్ర వేసేశారు. తెలుగులో ఆమె నటించిన రెండో సినిమా 'దోచేయ్‌' కూడా పెద్ద ఫ్లాపైంది. హిందీలో తొలి సినిమా 'హీరో పంటి' కూడా పెద్దగా ఆడలేదు. తాజాగా షారుఖ్‌, కాజోల్‌, వరుణ్‌ ధావన్‌ లాంటి పెద్ద తారలతో కలిసి స్టార్‌ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో ఆమె నటించిన 'దిల్‌ వాలే'కు కూడా నెగెటివ్‌ టాక్‌ వస్తోంది.

ఐతే ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయిందని ఆలోచించకుండా కృతి లెగ్గు పెట్టిందిగా అంటూ కొన్ని మీడియాల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు, చర్చలు మొదలైపోయాయి. కాస్త ఇంగిత జ్నానం ఉన్నవాళ్లెవరికైనా ఇందులో ఏమైనా లాజిక్‌ ఉందని అనిపిస్తుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు