రోబో-2.. ఓ వెయ్యి కోట్లేసుకోండి

రోబో-2.. ఓ వెయ్యి కోట్లేసుకోండి

మొత్తానికి ఇండియాస్‌ హైయెస్ట్‌ బడ్జెట్‌ ఫిలిం 'రోబో-2' మొదలైపోయింది. రూ.300 కోట్ల బడ్జెట్‌ అనుకున్నది కాస్తా.. రూ.400 కోట్లకు పెరిగిపోయింది. దీనికి ముందు హైయెస్ట్‌ బడ్జెట్‌ ఫిలిం రికార్డు బాహుబలిదే. ఆ సినిమా బడ్జెట్‌ రూ.250 కోట్లు. ఐతే అది రెండు భాగాలకూ కలిపి. కానీ రోబో-2 ఒక్క మూవీకే రూ.400 కోట్లు పెట్టేస్తున్నారు. బాలీవుడ్‌ వాళ్లే సాహసం చేయలేని ఈ బడ్జెట్‌ ను శంకర్‌ ఏమాత్రం సంకోచం లేకుండా పెట్టించేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే శంకర్‌ లాంటి వాడు ఏ ప్లానింగ్‌ లేకుండా ఇంత ఖర్చు పెట్టించేస్తాడనుకుంటే పొరబాటే. పెట్టే ఖర్చుకు రెట్టింపు వసూలు చేసేలా పకడ్బందీ వ్యూహంతోనే బరిలోకి దిగుతాడు శంకర్‌.

రోబో-2 కాంబినేషన్‌ కాంబినేషన్‌ క్రేజ్‌.. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి విస్తరించే మార్కెట్‌.. శంకర్‌ స్టామినా ప్రకారం చూస్తే రోబో-2 ఇండియాస్‌ హైయెస్ట్‌ గ్రాసర్‌ అయ్యే అవకాశాల్ని కూడా కొట్టి పారేయలేం. ప్రస్తుతానికి పీకే రూ.730 కోట్లతో నెంబర్‌ వన్‌ ప్లేస్‌ లో ఉంది. బాహుబలి లాంటి రీజనల్‌ మూవీనే రూ.600 కోట్లు కొల్లగొట్టిన నేపథ్యంలో త్వరలోనే రూ.1000 కోట్ల మార్కును ఇండియన్‌ సినిమా అందుకోవడం కష్టమేమీ కాదని అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్‌. ఆ ఘనతను రోబో-2 అందుకున్నా ఆశ్చర్యం లేదు.

బాహుబలి తర్వాత సౌత్‌ మూవీస్‌ కు నార్త్‌ లోనూ మార్కెట్‌ పెరిగింది. పైగా అక్షయ్‌ కుమార్‌ లాంటి బాలీవుడ్‌ స్టార్‌ యాడ్‌ అవుతున్నాడు. శంకర్‌-రజినీల కాంబినేషన్‌ కే రూ.500 కోట్లు కొల్లగొట్టే స్టామినా ఉంది. ఇక రూ.400 కోట్లు పెట్టి రోబో-2 తీస్తున్నాడంటే అందులో కంటెంట్‌ మామూలుగా ఉండదుగా. మూవీ హాలీవుడ్‌ స్టాండర్డ్స్‌ కు ఏమాత్రం తగ్గే అవకాశం లేదు. రోబో అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ, ముఖ్యంగా పిల్లల్నీ కూడా ఆకట్టుకున్న సినిమా. రోబో-2ను కూడా అన్ని వర్గాల ప్రేక్షకులూ ఆదరించే అవకాశముంది. బాహుబలి తరహాలో ప్రమోషన్‌ బాగా చేస్తే రోబో-2 వెయ్యి కోట్ల క్లబ్బును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English