గోపీచంద్‌ 'ఆక్సిజన్‌'తో రత్నం బతుకుతాడా?

గోపీచంద్‌ 'ఆక్సిజన్‌'తో  రత్నం బతుకుతాడా?

ఎ.ఎం.రత్నం.. దశాబ్దం వెనక్కి వెళ్తే తెలుగు, తమిళ భాషల్లో ఈ పేరు మార్మోగిపోయేది. రెండు చోట్లా భారీ సినిమాలు తీస్తూ అగ్ర నిర్మాతగా దశాబ్దంన్నర పాటు చక్రం తిప్పాడు రత్నం.

 కానీ ఓ దశలో వరుసగా దారుణమైన ఫ్లాపులు రావడంతో ఆయనపై పెనుభారం పడింది. దీంతో 'శ్రీ సూర్య మూవీస్‌' బేనరే కనుమరుగైపోయింది. కొన్నేళ్ల పాటు సినిమాలే తీయలేని పరిస్థితి వచ్చింది. ఐతే ఈ మధ్య 'శ్రీ సాయి మూవీస్‌' అని కొత్త బేనర్‌ పెట్టి అజిత్‌ పుణ్యమా అని వరుసగా హిట్లు కొట్టిన రత్నం కాస్త కోలుకున్నాడు.

అప్పట్లో రత్నం కింద పడ్డానికి అతడి కొడుకు జ్యోతికృష్ణ కూడా ఓ కారణమే. అతను దర్శకుడిగా మారి తీసిన తొలి సినిమా 'నీ మనసు నాకు తెలుసు' డిజాస్టర్‌ అయింది. ఆ తర్వాత తన తమ్ముడు రవికృష్ణ హీరోగా తీసిన 'కేడీ' విడుదలకే నోచుకోలేదు. దీంతో రత్నం దబేల్‌మని కింద పడ్డాడు.

ఐతే ఇప్పుడు లేచి మళ్లీ నిలబడే ప్రయత్నం చేస్త్న్ను రత్నం.. తెలుగులో సుదీర్ఘ విరామం తర్వాత ఓ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి జ్యోతికృష్ణే దర్శకుడు కావడం విశేషం. గోపీచంద్‌ హీరో. ఈ కాంబినేషన్లో రాబోయే సినిమాకు 'ఆక్సిజన్‌' అని పేరు పెట్టడం విశేషం. మరి ఈ 'ఆక్సిజన్‌'తో గోపీ... జ్యోతికృష్ణ, రత్నంలను బతికిస్తాడేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు