పవన్‌, మహేష్‌ మీడియా వార్‌!

పవన్‌, మహేష్‌ మీడియా వార్‌!

ప్రస్తుతం నంబర్‌వన్‌ హీరో ఎవరనే డిస్కషన్‌లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంకా తన బాక్సాఫీస్‌ స్టామినాపై ఉన్న ప్రశ్నలని క్లియర్‌ చేసుకోలేదు. బాద్‌షా ఫైనల్‌గా లాస్‌ వెంఛర్‌ కావడంతో ఎన్టీఆర్‌ ప్రస్తుతానికి ఈ రేసులో వెనుకబడ్డాడు. చరణ్‌ కన్సిస్టెంట్‌గా హిట్స్‌ ఇస్తున్నా ఇంకా అతడు స్టార్టింగ్‌ స్టేజ్‌లోనే ఉన్నాడని, మరో రెండేళ్లు నిలకడ చూపిస్తే కానీ అతడిని లిస్టులో వేయలేమని విశ్లేషకులు అంటున్నారు. సో... రైట్‌ నౌ పోటీ ఇద్దరి మధ్య బలంగా సాగుతోంది. మహేష్‌, పవన్‌ ఇద్దరూ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పుష్కరం పైగా గడిచిపోయింది. ఇద్దరికీ హిట్లు, ఫ్లాపులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో సమాదరణ ఉంది. ఇద్దరికీ కూడా క్రేజ్‌ పీక్స్‌లో ఉందిప్పుడు.

ఎవరు నంబర్‌వన్‌ అనే డిబేట్‌ ఇంకా సాగుతున్నా కానీ మీడియా పరంగా ఇద్దరి మధ్య ఓ ఆసక్తికరమైన వార్‌ నడుస్తోంది. ఇందులో హీరోల ప్రమేయం నామమాత్రమే అయినా కానీ పవన్‌కి రికార్డ్‌ పారితోషికం వచ్చిందని చెప్పగానే, వెంటనే దానిని దాటి మహేష్‌కి పారితోషికం ఇస్తున్నారని ఇంకో ప్రెస్‌నోట్‌ వస్తుంది. మళ్లీ దానిని కొట్టేశాడని పవన్‌ గురించి, దానినీ దాటేశాడని మహేష్‌ గురించి వరుసగా అప్‌డేట్స్‌ వస్తున్నాయి. నిజంగా ఇద్దరికీ ఇప్పుడు పారితోషికం ఎంత ఇస్తున్నారనేది తెలీదు కానీ మీడియా రిపోర్ట్స్‌లో మాత్రం ఇద్దరూ ఇప్పుడు సినిమాకొచ్చి ఇరవై కోట్లు తీసేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు