వామ్మో వాయ్యో...400 కోట్లా?

వామ్మో వాయ్యో...400 కోట్లా?

సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్లతో బాలీవుడ్డోళ్లకు పెద్ద తలనొప్పే వచ్చి పడింది. వందల కోట్ల బడ్జెట్‌ అంటారు.. హాలీవుడ్‌ ప్రమాణాలతో విజువల్‌ వండర్స్‌ తీస్తారు.. అనూహ్యమైన వసూళ్లు సాధిస్తారు. వీళ్ల దూకుడు తట్టుకునేదెలాగబ్బా అని మథన పడిపోతున్నారు బాలీవుడ్‌ జనాలు. మొన్న రాజమౌళి 'బాహుబలి' ఎలాంటి సంచలనాలు రేపిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రెండు భాగాలు కలిపి ఆ సినిమాకు రూ.250 కోట్ల బడ్జెట్‌ సమకూర్చి బాలీవుడ్‌ జనాలకు దిమ్మదిరిగిపోయేలా చేశాడు జక్కన్న. తొలి భాగమే రూ.600 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రాజమౌళి ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకునేసరికే ఇప్పుడు శంకర్‌ తయారయ్యాడు. అతను రూ.400 కోట్ల బడ్జెట్‌తో రంగంలోకి దిగుతూ మొత్తం భారతీయ పరిశ్రమనే విస్మయానికి గురి చేస్తున్నాడు.

రోబో-2 ఇండియాస్‌ హైయెస్ట్‌ బడ్జెట్‌ ఫిలిం కావచ్చని ఇప్పటికే అంచనాలున్నాయి. ఐతే 'బాహుబలి'ని దాటి రూ.300 కోట్లతో శంకర్‌ సినిమా తీస్తాడేమో అనుకున్నారు. కానీ అతను అందరి అంచనాల్ని మించిపోయాడు. ఏకంగా రూ.400 కోట్లు పెట్టడానికి లైకా ప్రొడక్షన్స్‌ ను ఒప్పించాడు. శంకర్‌, రజినీ కాంబినేషన్‌క్రేజ్‌, రోబో సీక్వెల్‌ అంటే ఉండే ఆసక్తి ప్రకారం చూస్తే ఇది మరీ ప్రమాదకరమైన బడ్జెట్‌ ఏమీ కాదు కానీ.. బాలీవుడ్‌ వాళ్లే భారీ సినిమాల మీద వంద కోట్లకు అటు ఇటు బడ్జెట్‌మాత్రమే పెడుతుంటే ఓ సౌత్‌ ఇండియన్‌ మూవీ మీద ఏకంగా రూ.400 పెట్టుబడికి ఒప్పించడమంటే మాటలు కాదు. ఇది శంకర్‌ కు మాత్రమే సాధ్యమయ్యే ఘనత. ఐతే ఊరికే బడ్జెట్‌ పెట్టించేసి హంగామా చేసే టైపైతే కాదు శంకర్‌. ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ తెరమీద చూపిస్తాడు. ఆ మొత్తాన్ని రాబట్టడానికి పక్కా ప్రణాళికా రచిస్తాడు. కాబట్టి లైకా ప్రొడక్షన్స్‌ టెన్షన్‌ పడాల్సిందేమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English