రోబో 2.0.. రెడీ 1 2 3

రోబో 2.0.. రెడీ 1 2 3

యాదృచ్ఛికంగా ఒకే రోజు రెండు అద్భుత చిత్రాలకు శ్రీకారం చుడుతోంది దక్షిణాది సినీ పరిశ్రమ. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఇద్దరు సిల్వర్‌ స్క్రీన్‌ మెజీషియన్స్‌ సూపర్‌ సీక్వెల్స్‌కు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. ఈ ఏడాది ఇండియన్‌ సినిమాను షేక్‌ చేసేసిన 'బాహుబలి.. ది బిగినింగ్‌'కు కొనసాగింపుగా రాజమౌళి 'బాహుబలి.. ది కంక్లూజన్‌' షూటింగ్‌ను బుధవారమే మొదలుపెడుతున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో చడీ చప్పుడు లేకుండా ఈ సినిమా షూటింగ్‌ ఆరంభమవుతోంది. మరో వైపు 'బాహుబలి' సెట్‌ చేసిన హై స్టాండర్డ్స్‌ను 'రోబో-2' ద్వారా అధిగమించి తీరాలన్న కృత నిశ్చయంతో ఉన్న శంకర్‌ కూడా ఆ సినిమాను ఈ రోజే ప్రారంభిస్తున్నాడు.

ఏడాది పాటు స్క్రిప్టు వర్క్‌లో తలమునకలై ఉన్న శంకర్‌.. డిసెంబరు 12న రజినీ కాంత్‌ పుట్టిన రోజే సినిమా ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాడు. కానీ చెన్నై వరదలు అడ్డం పడ్డాయి. ఇప్పుడు పరిస్థితి మెరుగవడంతో పెద్దగా హంగామా లేకుండా సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. '2.0 మొదలవుతోంది. చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తోంది'' అంటూ అర్ధరాత్రి ట్వీట్‌ చేశాడు శంకర్‌. అంతే వెంటనే రోబో-2 ట్విట్టర్‌ టాప్‌ ట్రెండింగ్స్‌ లిస్టులోకి వచ్చేసింది. 2.0 అన్నదే టైటిలా లేక.. 'రోబో 2.0' అనే పేరు పెడుతున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇండియాలోనే అత్యధికంగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. రజినీ సరసన అమీ జాక్సన్‌ ఈ సినిమాలో కథానాయికగా నటించనుంది. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English