భల్లాలదేవుడి బర్త్‌ డే.. పంచ్‌లు పేలిపోయాయ్‌

భల్లాలదేవుడి బర్త్‌ డే.. పంచ్‌లు పేలిపోయాయ్‌

బాహుబలి ఆడియో పంక్షన్‌ చూసిన వాళ్లందరికీ రాజమౌళి టీమ్‌ తమ మీద తామే పేల్చుకున్న జోకులు గుర్తుండే ఉంటాయి. బాహుబలి సినిమా మొదలయ్యాక ఆ యూనిట్‌ సభ్యుడొకరు పెళ్లి చేసుకోవడం.. అతడికి పిల్లలు కూడా పుట్టడం.. మెట్రో ప్రాజెక్టు మొదలై.. పూర్తయ్యే దశకు చేరుకోవడం గురించి.. వీడియోలు ప్రదర్శిస్తూ భలే కామెడీ చేసింది బాహుబలి టీం. ఇప్పుడు రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందఠంగా మరోసారి అలాంటి జోకే పేలింది. నిన్న రానా పుట్టిన రోజు సందఠంగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ విషెస్‌ చెబుతూ.. ''బాహుబలి మొదలయ్యాక రానా చేసుకుంటున్న మూడో పుట్టిన రోజు ఇది'' అంటూ ఫన్నీ ట్వీట్‌ పెట్టాడు.

దీనికి రానా కూడా సరదాగానే ఓ పంచ్‌ ఇచ్చాడు. ''ఇకపై బాహుబలి సెట్లో ఇలాంటి బర్త్‌ డేలు జరగకూడదను కోరుకుంటున్నా'' అన్నాడు. అంటే ఇంకా ఎన్నేళ్లు మమ్మల్ని బాహుబలి బందీలుగా ఉంచుతారంటూ పంచ్‌ వేశాడన్నమాట. ఐతే రానా చేసిన ఫన్నీ కామెంటుని శోభు లైట్‌ గానే తీసుకున్నాడు లెండి. ఐతే బాహుబలి-2 షూటింగ్‌ మొదలు కావడంలోనే ఆలస్యమవుతుండటంతో రానా ఇంకో పుట్టిన రోజు కూడా 'బాహుబలి' ప్రాజెక్టులో ఉండగానే చేసుకోక తప్పదేమో. బహుశా 2017 పుట్టిన రోజుకు బాహుబలి నుంచి పూర్తిగా బయటికి వస్తాడేమో. అయినా బాహుబలి లాంటి సినిమా కోసం ఎన్నేళ్లు ఖర్చు చేస్తే ఏంటి? ఈ సినిమాలో నటించిన ఎవ్వరికైనా కెరీర్లో చెప్పుకోవడానికి ఇది ఒక్కటి చాలదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు