టైగర్‌ రెండో రోజూ కుమ్మేసాడమ్మా

టైగర్‌ రెండో రోజూ కుమ్మేసాడమ్మా

ఛస్‌... రొటీన్‌గా వుందంటూ 'బెంగాల్‌ టైగర్‌'ని విమర్శిస్తున్నారు. మరీ పాత చింతకాయ ధోరణిలో సినిమా తీసాడని సంపత్‌నందిని విమర్శిస్తున్నారు. కానీ మాస్‌ జనాలు మాత్రం చాలా కాలం తర్వాత వచ్చిన పక్కా మాస్‌ మసాలా సినిమాని ఆవురావురు అంటూ చూసేస్తున్నారు. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆరు కోట్లకి పైగా షేర్‌ సాధించిన ఈ చిత్రం రెండో రోజు కూడా వసూళ్ళు కుమ్మేసిందని ట్రేడ్‌ వర్గాల వాళ్ళు చెబుతున్నారు. గురువారం విడుదలైన ఈ చిత్రం వర్కింగ్‌ డే అయిన శుక్రవారం కూడా సాలిడ్‌గా నిలబడింది కనుక వీకెండ్‌లో వసూళ్ళు బాగుంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఫస్ట్‌ వీకెండ్‌ తిరిగే సరికి పదిహేను కోట్లకి పైగా షేర్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. అటుపై కూడా మాస్‌ ఆదరిస్తే తొలి వారానికే ఇరవై కోట్ల మార్కు దాటేసే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో లోఫర్‌ తప్ప తెలుగు చిత్రాల పరంగా కాంపిటీషన్‌ లేదు కనుక సేఫ్‌ అవడానికి ఛాన్స్‌లున్నాయని ట్రేడ్‌ అంచనా వేస్తోంది. అయితే అంత లాంగ్‌ రన్‌ ఈ సినిమాకుంటుందా, నాలుగు రోజుల తర్వాత వసూళ్ళు వస్తాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు