కాస్కోండి.. రజనీ తర్వాత మహేషే!

కాస్కోండి.. రజనీ తర్వాత మహేషే!

'బెంగాల్‌ టైగర్‌'లో రజనీకాంత్‌ తర్వాత దక్షిణాదిలో పవన్‌కళ్యాణే పెద్ద స్టార్‌ అనే డైలాగ్‌ చాలా మందికి నచ్చడం లేదు. ముఖ్యంగా మహేష్‌ అభిమానులు ఈ డైలాగ్‌తో అఫెండ్‌ అవుతున్నారు. తెలుగు చిత్ర సీమలో ఇప్పుడు పవన్‌ నంబర్‌వన్‌ అంటేనే వాళ్ళు ఒప్పుకోరు. అలాంటిది దక్షిణాది చిత్రసీమకే అంటే ఎందుకు ఊరుకుంటారు? ఈ డైలాగ్‌ చెప్పుకుని ఎగిరిపడుతోన్న పవన్‌ ఫాన్స్‌కి వాళ్ళు సవాల్‌ విసురుతున్నారు.

మురుగదాస్‌ డైరెక్షన్‌లో మహేష్‌ చేస్తోన్న సినిమాతో సౌతిండియాకి రజనీ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌ అనేది ప్రూవ్‌ అవుతుందని, తమిళనాడులో తనకంటూ మార్కెట్టే లేని పవన్‌ కళ్యాణ్‌ అసలు రజనీతో ఎలా సరితూగుతాడని అంటున్నారు. వంద కోట్ల పైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న మురుగదాస్‌, మహేష్‌ సినిమా ఖచ్చితంగా మహేష్‌ని తమిళనాడులో పెద్ద స్టార్‌గా నిలబెడుతుందని, రజనీ తర్వాత సౌతిండియాలో అన్ని రాష్ట్రాల్లో భారీ మార్కెట్‌ వున్న హీరోగా మహేష్‌ అవతరిస్తాడని ఫాన్స్‌ నమ్మకం. సంపత్‌ నంది తన అభిమానాన్ని చాటుకోవడానికి ఆ డైలాగ్‌ రాయడమేంటో గానీ అభిమానుల మధ్య మాత్రం నిప్పు రాజేసుకుని సవాళ్లు, ప్రతి సవాళ్లతో సోషల్‌ మీడియా దద్ధరిల్లిపోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English