సూపర్ స్టార్ కన్నా పవర్ స్టారే గొప్ప!

సూపర్ స్టార్ కన్నా పవర్ స్టారే గొప్ప!

మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ రజినీకాంతే. ఎందుకంటే ఆయన పాపులారిటీ.. కేవలం తమిళనాడుకు పరిమితం కాదు. తెలుగు, కన్నడ, మలయాళ రాష్ట్రాల్లోనూ ఆయనకు భారీ అభిమాన గణం ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా రజినీకున్న ఫాలోయింగ్ అలాంటిలాంటిది కాదు. అందుకే సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ రజినీకాంతే అనడంలో సందేహాల్లేవు. ఐతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ కంటే మిన్న అంటున్నాడు సంపత్ నంది. ఈ మాట సంపత్ నోటితో కాదు.. పెన్నుతో చెప్పాడు.

‘‘సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించిన స్టార్ రాడనుకున్నాం.. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలేదా’’ ఇదీ బెంగాల్ టైగర్ సినిమాలో ఓ డైలాగ్. పవన్ అభిమానులకే అతిగా అనిపించింది ఈ డైలాగ్ వింటుంటే. పవన్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకోవడానికే సంపత్ ఈ డైలాగ్ రాసినట్లున్నాడు. సినిమాలో పవన్ రెఫరెన్సులు ఇంతటితో ఆగిపోలేదు. ‘‘మొన్న ఎన్నికల్లో ఓ పార్టీ తరఫున ఓ స్టార్ ప్రచారం చేస్తే జనాలు ఓట్లు గుద్దేయలేదూ’’ అంటూ పవన్ పొలిటికల్ పవర్ మీద కూడా ఓ డైలాగ్ పేల్చాడు సంపత్. అత్తారింటికి దారేది క్లైమాక్స్‌ను కూడా పేరడీ చేస్తూ ఓ సీన్ కూడా పెట్టాడు. మొత్తానికి తనను గబ్బర్ సింగ్-2 నుంచి తనను తప్పించినప్పటికీ అదేమీ మనసులో పెట్టుకోకుండా ‘బెంగాల్ టైగర్’లో పవన్ ను బాగానే మోశాడు సంపత్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English