గబ్బర్‌ సింగ్‌-2 నుంచి ఎందుకొచ్చేశానంటే...

గబ్బర్‌ సింగ్‌-2 నుంచి ఎందుకొచ్చేశానంటే...

పవన్‌ కళ్యాణ్‌ లాంటి హీరోతో సినిమా చేయడం ఏ దర్శకుడికైనా గొప్ప అవకాశమే. కేవలం రెండు సినిమాల అనుభవంతో ఆ అవకాశం దక్కిందని సంబరపడ్డ సంపత్‌ నంది.. చివరికి తీవ్ర నిరాశకు గురయ్యాడు. 'గబ్బర్‌ సింగ్‌-2' కోసం రెండేళ్లు పడ్డ కష్టం వృథా అయింది. చివరికి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీని వల్ల సంపత్‌ కెరీర్‌కు చాలా పెద్ద నష్టమే జరిగింది. అయినప్పటికీ ఎప్పుడూ పవన్‌ గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు సంపత్‌. అసలు గబ్బర్‌ సింగ్‌-2 విషయంలో ఏం జరిగిందన్నది కూడా ఎప్పుడూ వెల్లడించలేదు. ఐతే 'బెంగాల్‌ టైగర్‌' రిలీజ్‌ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తొలిసారి ఆ చేదు అనుభవం గురించి నోరు విప్పాడు సంపత్‌.

''రచ్చ తర్వాత పవన్‌తో సినిమా చేయాలనుకున్నా. కథ కూడా రాసుకున్నా. ఐతే పవన్‌ తాను రాసిన 'గబ్బర్‌ సింగ్‌-2' మీద పని చేద్దామన్నారు. నేను స్క్రీన్‌ ప్లే, ట్రీట్మెంట్‌ మీద వర్క్‌ చేశాను. కానీ మా ఇద్దరి ఆలోచనలు సరిపోలేదు. దీంతో నేను ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేయాల్సొచ్చింది. ఐతే అది జరిగిన రెండు రోజులకే రవితేజ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆయనకు బెంగాల్‌ టైగర్‌ కథ నచ్చి సినిమా ఓకే అయింది. ఐతే పవన్‌తో నా సంబంధాలేమీ దెబ్బ తినలేదు. ఆయన్నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఆయనతో చాలా రోజులు కలిసి ట్రావెల్‌ చేయడం వల్ల నాలో చాలా పరిణతి వచ్చింది. సినిమా పరిజ్నానం కూడా పెరిగింది. భవిష్యత్తులో పవన్‌తో కచ్చితంగా సినిమా చేస్తా. త్వరలోనే ఆయనకు కథ చెబుతా'' అన్నాడు సంపత్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English