వినాయక్‌ వంతుగా మూడు కోట్లు?

వినాయక్‌ వంతుగా మూడు కోట్లు?

ఇది చెన్నై వరద బాధితుల్ని ఆదుకోవడానికి ఆదుకోవడానికి ఇచ్చిన విరాళం కాదు.. 'అఖిల్‌' సినిమాతో దారుణంగా నష్టపోయిన బయ్యర్లను గట్టెక్కించడానికి ఇచ్చిన పరిహారం. పెద్ద సినిమాలకు భారీ నష్టాలు వచ్చినపుడు బయ్యర్లను ఆదుకోవడానికి హీరో, దర్శకుడు తమ రెమ్యూనరేషన్లో కొంత వెనక్కి ఇవ్వాలని ఫిలిం ఛాంబర్లో ఒక అనధికారిక ఒప్పందం జరిగింది లెండి. అందులో భాగంగానే వినాయక్‌ తన పారితోషకంలోంచి రూ.3 కోట్లను వెనక్కి ఇచ్చినట్లు సమాచారం.

అఖిల్‌ సినిమా మీద బయ్యర్లు రూ.45 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు.  కానీ అందులో సగం కూడా వెనక్కి రాలేదు. దీంతో బయ్యర్లు నితిన్‌ పీక మీద కత్తి పెట్టారు. అతను మాత్రం ఎంతని సెటిల్‌ చేస్తాడు చెప్పండి. కొంతవరకు నాగార్జున కూడా సాయం చేసినా.. తనూ కొంత డబ్బులు బయటికి తీసినా.. ఇంకా పూడ్చాల్సిన లోటు చాలానే మిగిలింది. అందుకే తన వంతుగా వినాయక్‌ రూ.3 కోట్లు తిరిగిచ్చేశాడు. అతడి పారితోషకం ఓ పది కోట్ల దాకా ఉంటుందని సమాచారం. డబ్బులు పోయినా పర్వాలేదు కానీ.. 'అఖిల్‌' సినిమాతో వినాయక్‌ ఇమేజ్‌కే పెద్ద డ్యామేజ్‌ వచ్చింది. ఇంతకుముందు అతడి ఫ్లాప్‌ సినిమాలు కూడా కలెక్షన్లు బాగానే వసూలు చేసేవి. కానీ 'అఖిల్‌' ఫిగర్స్‌ మాత్రం దారుణాతి దారుణంగా ఉండి వినాయక్‌ పేరును బాగా చెడగొట్టాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు