ముసలి సూపర్‌స్టార్లపై అనుష్క ఫైర్‌

ముసలి సూపర్‌స్టార్లపై అనుష్క ఫైర్‌

దుందుడుకు విరాట్‌ కోహ్లీతో సహచర్యమో లేక నిర్మాతగా మారి సినిమాలు తీసే లెవల్‌కి వచ్చినందువల్ల వచ్చిన ఆత్మ విశ్వాసమో తెలీదు కానీ అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. సినీ రంగంలోని లింగపరమైన వివక్ష గురించి ఆమె ఫైరఅవుతోంది. సినిమా ఇండస్ట్రీలో హీరోలకి ఎంత ఏజ్‌ అయిపోయినా ఇంకా సూపర్‌స్టార్లుగా చలామణీ అవుతుంటారని, అదే ఆడవాళ్లు అయితే ఒక ఏజ్‌ దాటగానే ఇక తేలికైపోతారని అనేసింది. అమ్మాయిలు ఎప్పుడూ అందంగా ఎందుకు కనిపించాలి, అంగాంగ ప్రదర్శనలు చేసుకుంటూ ఎందుకు తిరగాలని అనుష్క ప్రశ్నించింది.

లేడీస్‌ని సెక్స్‌ ఆబ్జెక్ట్‌గా చూసే మనస్తత్వం పోవాలని ఆమె అభిప్రాయపడింది. హీరోయిన్‌ కాకముందు వరకు తనకి ఆడ, మగ తేడా తెలీకుండా తన తల్లిదండ్రులు పెంచారని, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే ఆడవాళ్లని ఎంత చులకనగా చూస్తారనేది తెలిసిందని అనుష్క చెప్పింది. అలాగే పేమెంట్‌ విషయంలో ఆడవాళ్లకి తక్కువ ఇస్తుంటారని, మగవాడు ఇల్లు చూసుకోవాలి కనుక అతనికి డబ్బులెక్కువ కావాలని, అదే ఆడవాళ్లని చూసుకోవడానికి ఎలాగో ఒక మగాడుంటాడని వారు భావిస్తుంటారని అనుష్క ఫైర్‌బ్రాండ్‌లా రెచ్చిపోయింది. అనుష్కలో ఇంతకాలం ఈ కోణం చూడని వాళ్లు ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. షారుక్‌లాంటి హీరోలతో నటించిన అనుష్క ఇప్పుడు వాళ్ల ఏజ్‌నే క్వశ్చన్‌ చేస్తోందంటే మామూలు విషయం కాదుగా మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు