అఖిల్‌కి ఆదిలోనే బ్రేకులు

అఖిల్‌కి ఆదిలోనే బ్రేకులు

నిండా ఇరవై ఒక్క ఏళ్లు అయినా లేకుండానే హీరోగా అడుగు పెట్టిన అఖిల్‌ మొదటి సినిమా ఎంపిక నుంచి చాలా విషయాల్లో పొరపాట్లు చేశాడు. దాంతో అతను కోరుకున్న డ్రీమ్‌ లాంఛ్‌ లభించకపోగా, తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే ఘోర పరాజయం ఎదురైంది. మంచి కథ దొరికే వరకు వేచి చూద్దామని ఎంతమంది నచ్చజెప్పినా కానీ తనకి అఖిల్‌ కథ బాగా నచ్చిందంటూ ఆ చిత్రం చేయడానికి తానే ప్రధాన కారణమయ్యాడట. ఈ చిత్ర పరాజయంతో డిప్రెషన్‌కి గురైన అఖిల్‌ రెండో సినిమా విషయంలో మాత్రం పొరపాట్లు చేయరాదని, కథ విషయంలో అస్సలు రాజీ వద్దని అంటున్నాడట.

వచ్చే యేడాదిలో తన సినిమా రిలీజ్‌ కాకపోయినా ఫర్వాలేదని, రెండో చిత్రంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను గురి తప్పకూడదని అఖిల్‌ ఫిక్సయ్యాడట. మొదటి సినిమా విడుదలైన తర్వాత ఎక్కువ గ్యాప్‌ మంచిది కాదని, రాంగ్‌ సిగ్నల్స్‌ పంపిస్తుందని కొందరు చెప్తున్నా కానీ రెండో చిత్రం కనుక మిస్‌ఫైర్‌ అయితే హీరోగా తాను అనుకున్న పొజిషన్‌కి చేరుకోవడం కష్టమవుతుందని అఖిల్‌కి బాగా తెలుసునట. అందుకే రెండో సినిమాకి రెండేళ్లయినా ఫర్వాలేదు కానీ, హిట్‌ మాత్రం పక్కాగా కొట్టాలని చెప్తున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు