రియల్‌ హీరో సిద్ధార్థ్‌

రియల్‌ హీరో సిద్ధార్థ్‌

ఏదైనా ఆపద ముంచుకొస్తే వెంటనే విరాళం ప్రకటించి తమ పెద్ద మనసుని చాటుకుంటూ వుంటారు సెలబ్రిటీలు. అయితే నిజంగా కష్టాల్లో వున్న జనం కోసం ముందుకి కదిలి, ఆ ప్రాంతాలకి వెళ్లి వాళ్ల బాగోగులు చూడడం అందరి వల్లా కాదు. దాని కోసం రియల్‌ హీరోలై వుండాలి. తాను నిజమైన హీరోనని చేసి చూపిస్తున్నాడు సిద్ధార్థ్‌. అంతటి విలాసవంతమైన జీవితం గడుపుతోన్న తన ఇంటిలోకే నీళ్లు వచ్చేసేసరికి అసలు ఇక సామాన్య జనం ఏమైపోతున్నారనే ఆలోచన సిద్ధార్థ్‌ని పట్టి కుదిపేసింది. అంతే ఇక తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఒక టీమ్‌ ఫార్మ్‌ చేశాడు. ఫుడ్‌ ప్యాకెట్లు, వాటర్‌ ప్యాకెట్లు సేకరించి వీధి వీధి తిరుగుతూ ఆపదలో వున్న వారికి అండగా నిలుస్తున్నాడు.

తనకున్న ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ సాయంతో సిద్ధార్థ్‌ కొన్ని కార్పొరేట్‌ సంస్థలని కూడా మోటివేట్‌ చేసి చెన్నయ్‌ని ఆదుకునేలా చూస్తున్నాడు. సిద్ధార్థ్‌ అలుపెరగకుండా చేస్తోన్న ఈ సేవని చూసి ప్రతి ఒక్కరూ నువ్వే రియల్‌ హీరో అంటూ పొగిడేస్తున్నారు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ హీరోలా కాకుండా సామాన్యుడిలా స్పందించే సిద్ధార్థ్‌ నిజంగా తన ఊరికే కష్టమొస్తే మాటలు కాకుండా చేతల్లోనే చేయగలనని నిరూపించుకున్నాడు. హేట్సాఫ్‌ టు సిద్ధు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు