పవన్‌కళ్యాణ్‌తో ఇంకోటేసుకుంటాడట

పవన్‌కళ్యాణ్‌తో ఇంకోటేసుకుంటాడట

త్రివిక్రమ్‌తో పని చేయాలంటూ చాలా మంది హీరోలు ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడొస్తుందా అని మహేష్‌ ఫాన్స్‌ పడిగాపులు పడుతోంటే ఎప్పటికప్పుడే 'ఇదిగో, అదిగో' అంటున్నారే తప్ప కలిసి సినిమా ప్లాన్‌ చేయడం లేదు. ఈలోగా అఖిల్‌, చరణ్‌లాంటి హీరోలు అతనితో సినిమా చేయాలని పెద్ద పెద్ద రికమండేషన్లే పట్టుకెళ్తున్నారు. తెలుగులో ఎవరితో చేస్తే ఏం తరటా వస్తుందోనని సుబ్బరంగా తమిళ హీరో సూర్యతో ఒక సినిమా లాగించేద్దామని త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. అయితే దీని కంటే ముందు త్రివిక్రమ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌ పవన్‌కళ్యాణ్‌తో ఒక సినిమా వుండవచ్చుననేది తాజా సమాచారం.

జల్సా, అత్తారింటికి దారేది తర్వాత ఈ కాంబినేషన్‌పై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వుండడంతో ఆ హ్యాట్రిక్‌ సినిమా ఏదో త్వరగా ఇచ్చేద్దామని స్నేహితులు సమాలోచనలు జరుపుతున్నారట. తనకి ఎప్పుడో అడ్వాన్స్‌ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్‌ నుంచి ఒత్తిడి బాగా వుండడంతో ఈ ప్రాజెక్ట్‌ని ఆ బ్యానర్‌పై చేసేద్దామని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడట. పవన్‌కళ్యాణ్‌ కూడా త్రివిక్రమ్‌ ఎలాగంటే అలాగే అనేస్తాడు కనుక ఈ సినిమా 'గబ్బర్‌సింగ్‌' పనులు పూర్తి కాగానే సెట్స్‌ మీదకి వెళ్లినా వెళ్లవచ్చునట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు