ఐస్‌ పెట్టడం మానేసిన సమంత

ఐస్‌ పెట్టడం మానేసిన సమంత

సిద్ధార్థ్‌తో మూడేళ్ల పాటు లవ్‌స్టోరీ నడిపిన సమంత ఒకానొక రోజున అతనికి గుడ్‌బై చెప్పేసింది. అంతకుముందు చాలా మంది హీరోయిన్లతో అఫైర్స్‌ నడిపిన సిద్ధార్థ్‌ ఈ లవ్‌స్టోరీ ఇలా ఎండ్‌ అవడం తట్టుకోలేకపోయాడు. సమంత దానిని చాలా క్యాజువల్‌గా తీసుకుని సిద్ధార్థ్‌తో స్నేహం కొనసాగించాలని చూసింది. అతనికి నిరంతరం ఐస్‌ పెట్టడానికి సమంత చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ సిద్ధార్థ్‌ మాత్రం బాగా హర్ట్‌ అవడంతో ఆమె ఎన్ని విధాలుగా స్నేహంగా వుండాలని చూసినా కానీ రెస్పాండ్‌ అవలేదు. తమిళ చిత్ర రంగంలో చిన్న సినిమాలతో సక్సెస్‌ అయిన సిద్ధార్థ్‌ నిర్మాతగా కూడా బిజీ అయ్యాడు.

సమంతని పక్కన పడేసి కెరియర్‌ మీద దృష్టి పెట్టిన సిద్ధార్థ్‌ ఆ తర్వాత మళ్లీ ప్రేమ ఊసెత్తలేదు. సిద్ధార్థ్‌తో మంచిగా వున్నట్టు ప్రపంచానికి కనిపించాలని, గుడ్‌ గాళ్‌ అనిపించుకోవాలని చూసిన సమంత ఇప్పుడిక ఆ ప్రయత్నాలు మానేసింది. సిద్ధార్థ్‌కి ఐస్‌ పెట్టే పని మానేసి అసలు అతను ఏం చేస్తున్నాడనేది కూడా పట్టించుకోవట్లేదు. సిద్ధార్థ్‌ మాత్రం ఆమెతో విడిపోవడమే తనకి జీవితంలో జరిగిన మంచి అంటున్నాడు. సమంత ఏమో నీ అసలు రంగు తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టిందంటూ ఇన్‌డైరెక్టుగా చురకలేసింది. ఏదైతేనేం సినీ ప్రేమలు ఆట్టే కాలం నిలబడవని నిరూపించడానికి ఈ జంట తాజా ఉదాహరణగా నిలిచింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు