తమిళులు మళ్లీ అలిగారు!

తమిళులు మళ్లీ అలిగారు!

ఏదో ఒక సినిమా రావడం, అందులో ఏదో ఒక అంశం తమిళులకు కోపం తెప్పించడం రొటీన్ గా మారినట్టుంది ఈ మధ్య. విశ్వరూపం సినిమా చూసి తమిళులు ఎలా మండిపడ్డారో చూశాం కదా! సినిమా విడుదలవ్వడానికే వీల్లేదని అడ్డుపడ్డారు. నానా హంగామా చేశారు. పాపం కమల్ హాసన్ జీవితమే రిస్కులో పడిపోయింది. అతడు గట్టెక్కడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ ప్రెస్ ట్రెయిలర్ చూసి కూడా అలాగే నిప్పులు కక్కారు తమిళులు. తమ సంప్రదాయాలను అవమానించారని, సంస్కృతిని తక్కువ చేశారనీ గొడవ చేశారు. ఆ సినిమా ఎలా విడుదల అవుతుందో చూస్తామని అన్నారు. ఇప్పుడు మరో సినిమా తమిళ తంబిలకు కోపం తెప్పించింది. అదే మద్రాస్ కేఫ్. జాన్ అబ్రహామ్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ గా, నర్గీస్ ఫక్రి రిపోర్టర్ గా నటించిన ఈ చిత్రాన్ని షోజిత్ శిర్కర్ తెరకెక్కించాడు.

టెర్రరిస్టుల బ్యాగ్రౌండ్ తో తీసిన ఈ సినిమా ట్రెయిలర్ చూసి తమిళనాడు వారికి చాలా కోపమొచ్చేసింది. నాం తాంజర్ అనే సంస్థకి చెందిన సానుభూతిపరులు విరుచుకుపడ్డారు. తమిళుల హక్కుల కోసం ప్రాణాలను సైతం అర్పిస్తోన్న ఎల్టీటీఈ సైనికులని టెర్రరిస్టుల మాదిరిగా చూపించారంటూ ఆవేశపడ్డారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ సినిమాని ముందు తమకు చూపించాలని, లేదంటే తమిళనాడులో విడుదల కానివ్వమని బెదిరించారు. ఇదెక్కడి గొడవరా దేవుడా అంటూ తల పట్టుకున్నాడు శిర్కర్. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటాడో ఏమో! అయినా ఏ సినిమా తీసినా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే, ఇక దర్శకులు ప్రయోగాలు ఎలా చేస్తారు! డిఫరెంట్ సినిమాలు ఎలా వస్తాయి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు