పాపం ప్రభాస్‌కి ఈ టెన్షనేంటో

పాపం ప్రభాస్‌కి ఈ టెన్షనేంటో

పెదనాన్న కారణంగానే హీరో అయ్యానని, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఈజీ అయిందని, బాహుబలిలాంటి సినిమా చేసి జాతీయ గుర్తింపు పొందే వీలు చిక్కిందని ప్రభాస్‌కి కృష్ణంరాజు అంటే ఎనలేని మర్యాదా మన్ననలు. పెదనాన్నకి ఎలాగైనా సాయ పడాలని బిల్లా చిత్రం చేసాడు. ఆ చిత్రంలో పోలీస్‌ పాత్రని కృష్ణంరాజు చేస్తానంటే కాదనలేకపోయాడు. అందులో ఆ పాత్రని ఎవరైనా యంగ్‌ యాక్టర్‌ చేసి వుంటే బాగుండేదని అనుకున్నారు. బిల్లాతో ఆర్థికంగా నష్టాలే చూసిన కృష్ణంరాజుకి మళ్లీ ఏదైనా చేయాలని ప్రభాస్‌ అనుకుంటున్నాడు కానీ ఆయన ట్రెండ్‌కి తగ్గ సినిమాలేమీ ప్లాన్‌ చేయడం లేదు. ప్రభాస్‌ని తన డైరెక్షన్‌లో చూడాలని కృష్ణంరాజుకి చాలా కాలంగా ఓ కోరిక వుంది. అప్పట్లో తనతో ఒక సినిమా చేస్తానంటూ ఆయన హడావిడి కూడా చేసారు.

బాహుబలి తర్వాత ఇక ప్రభాస్‌తో చేసే ఆలోచన మానుకుంటారేమో అనుకుంటే తదుపరి చేసే చిత్రాల్లో తన సంస్థకి చెందిన సినిమా కూడా ఒకటి వుండాలని కృష్ణంరాజు పట్టు పడుతున్నారు. తానే కొన్ని కథలు రాయడంతో పాటు తనకి నచ్చిన వాటిని కొన్ని ఎంపిక చేసి పెట్టుకున్నారు. దందా అనే టైటిల్‌ కూడా రిజిష్టర్‌ చేసిన కృష్ణంరాజుకి ప్రభాస్‌ నచ్చ చెప్పుకోగలడో లేక గౌరవం కొద్దీ పెదనాన్న సినిమా చేసేస్తాడో అని ప్రభాస్‌ రాజు అభిమానులు ఈ వార్త విన్న దగ్గర్నుంచీ కొంచెం టెన్షన్‌ పడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు