త్రీ ఇడియట్స్‌ రికార్డు ఉఫ్‌

త్రీ ఇడియట్స్‌ రికార్డు ఉఫ్‌

త్రీ ఇడియట్స్‌.. ఇండియన్‌ సినిమాను మరో మెట్టు ఎక్కించిన సినిమా. ఆ సినిమా మీద ప్రశంసలే కాదు.. కలెక్షన్ల వర్షమూ కురిసింది. అలాంటి సినిమా కలెక్షన్లను నెగెటివ్‌ టాక్‌తో మొదలైన సల్మాన్‌ ఖాన్‌ సినిమా 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' సునాయాసంగా దాటేసింది. సూరజ్‌ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు టాక్‌ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం ఆగట్లేదు.

ఇప్పటికే కొన్ని రికార్డులు నెలకొల్పిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' తాజాగా 'త్రీ ఇడియట్స్‌'  భారత్‌లో రాబట్టిన కలెక్షన్ల మొత్తాన్ని దాటేసింది. మన దేశంలో 'త్రీ ఇడియట్స్‌' మొత్తంగా రూ. 202 కోట్లు వసూలు చేయగా.. 'ప్రేమ్‌రతన్‌..' 15 రోజుల్లోనే దాన్ని దాటేసి రూ. 203.53 కోట్లు వసూలు చేసింది.

రూ.110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' తొలి మూడు రోజుల్లోనే గ్రాస్‌ కలెక్షన్లలో ఆ మొత్తాన్ని రాబట్టేసింది. తొలి రోజే ఈ సినిమా రూ.60 కోట్ల దాకా గ్రాస్‌ వసూళ్లు సాధించడం విశేషం. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.480 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు అంచనా. డివైడ్‌ టాక్‌తో మొదలైనా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబడుతోందంటే సల్మాన్‌ ఖాన్‌బాక్సాఫీస్‌ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు