సుక్కు ఫ్రెండుకి ఇంటర్నేషనల్‌ ఆఫర్‌

సుక్కు ఫ్రెండుకి ఇంటర్నేషనల్‌ ఆఫర్‌

సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా అంటే కొన్ని పేర్లు కామన్‌. మ్యూజిక్‌ డైరక్టర్‌గా దేవిశ్రీ ఉంటే.. ఛాయాగ్రహణం రత్నవేలే అందిస్తాడు. సుకుమార్‌ సినిమాల కోసం రత్నవేలు కొన్ని పెద్ద పెద్ద అవకాశాలే వదులుకున్నాడు సుక్కు కూడా రత్నవేలు కోసమే తన సినిమాల్ని ఆలస్యం చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. అంత మంచి స్నేహం వాళ్లిద్దరిదీ. సుకుమార్‌తో జట్టు కట్టడానికి ముందే రత్నవేలు సౌత్‌ ఇండియాలో టాప్‌ సినిమాటోగ్రాఫర్‌. రోబో లాంటి ఇంటర్నేషనల్‌ రేంజ్‌ సినిమా చేశాడతను. ఇప్పుడు అతను నేరుగా ఓ ఇంటర్నేషనల్‌ సినిమానే చేయబోతున్నాడు. త్వరలోనే అతను ఓ హాలీవుడ్‌ సినిమాకు పని చేయబోతున్నట్లు సమాచారం.

గత ఏడాదే ఈ ఇంగ్లిష్‌ మూవీకి పని చేయడం కోసం రత్నవేలుకు ఆఫర్‌ వచ్చిందట. కానీ ఆ సినిమా అనుకున్న సమయానికి సెట్స్‌ పైకి వెళ్లలేదట. ఐతే ఈ మధ్యే అదే సంస్థ మళ్లీ రత్నవేలును అడగడంతో పాటు షెడ్యూల్‌ ఇచ్చిందట. రత్నవేలు ఒప్పుకుని డేట్లు కూడా ఇచ్చేశాడట. త్వరలోనే ఆ సినిమా వివరాల్ని వెల్లడిస్తానని అంటున్నాడు రత్నవేలు. ఈ సినిమాను ఓ ప్రతిష్టాత్మక బ్రిటన్‌ స్టూడియో నిర్మిస్తుందని.. షూటింగ్‌ అంతా లండన్లోనే సాగుతుందని.. ఈ ప్రాజెక్టు గురించి వివరాలు వెల్లడైనపుడు అందరూ షాకవుతారని అంటున్నాడు రత్నవేలు. ఇటీవలే 'కుమారి 21 ఎఫ్‌' కోసం పని చేసిన రత్నవేలు ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో'కి ఛాయాగ్రహణం అందిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English