సూర్య 24.. ఏంటి కథ?

సూర్య 24.. ఏంటి కథ?

సౌత్‌ ఇండియాలో కమల్‌ హాసన్‌ తర్వాత విలక్షణమైన పాత్రలకు పెట్టింది పేరైన కథానాయకుడు సూర్యానే. అతడి చేసే సినిమాల్లో ఒకదానికి ఇంకోదానికి అస్సలు పోలికన్నదే ఉండదు. ఇక దర్శకుడు విక్రమ్‌.కె.కుమార్‌ కూడా మొదట్నుంచి వైవిధ్యమైన సినిమాలే తీశాడు. ఇష్టం, 13బి, ఇష్క్‌, మనం.. ఈ చిత్రాల వరస చూస్తేనే అతడెంత డిఫరెంటో అర్థమైపోతుంది. మరి వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా తీస్తుంటే కచ్చితంగా అది వైవిధ్యంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. '24' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు చూస్తుంటేనే ఆ సంగతి అర్థమైపోతోంది.

ఐతే ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలకు మన దగ్గర సక్సెస్‌ రేట్‌ తక్కువే. సాధారణంగా ఇలాంటి సినిమాల విషయంలో జనాలు ఏదో అనుకుని వస్తారు. తెరమీద దర్శకులు ఇంకేదో చూపిస్తారు. అందుకే ఏమీ చెప్పకుండా ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేయడం కంటే కూడా సినిమా గురించి కొంచెం రివీల్‌ చేసి.. వాళ్లను ప్రిపేర్‌ చేయడం కూడా ముఖ్యమే అని '24' టీం జాగ్రత్త పడుతోంది. 24 కథను కొద్దిగా మీడియాకు లీక్‌ చేయడానికి ఇదే కారణం. చిత్ర యూనిట్‌ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం హీరో ఇందులో టైమ్‌ మిషన్‌ తరహా వాచ్‌ ద్వారా గతంలోకి ప్రయాణం చేసి తన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతడికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సినిమాలో సూర్య టైం మెషీన్‌ వాచ్‌ కనుక్కునే సైంటిస్టుగా, అతడి కొడుగ్గానే కాక.. ఆత్రేయ అనే విలన్‌ పాత్ర కూడా చేస్తున్నాడట. సమంత, నిత్యామీనన్‌ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు