ఆ రికార్డు కూడా అఖిల్‌ ఖాతాలోకే..

ఆ రికార్డు కూడా అఖిల్‌ ఖాతాలోకే..

రూ.45 కోట్లు. అఖిల్‌ సినిమాకు జరిగిన బిజినెస్‌ ఇది. తెలుగులోనే కాదు.. సౌత్‌ ఇండియాలో ఏ అరంగేట్ర హీరోకు కూడా సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు అఖిల్‌. కానీ ఇప్పుడు అతడి ఖాతాలో ఇంకో రికార్డు కూడా చేరింది. కానీ ఆ రికార్డు అతణ్ని ఏమాత్రం సంతోష పెట్టేది కాదు. ఏ అరంగేట్ర హీరో సినిమాకూ రానంత భారీ నష్టాలు నష్టాలు వచ్చాయి 'అఖిల్‌' సినిమాకు. ఫుల్‌ రన్‌ లో ఈ సినిమా కేవలం రూ.17.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'అఖిల్‌' సినిమాను కొన్న బయ్యర్లందరూ సగానికి సగం నష్టపోయారు.

కర్ణాటకకు సినిమాను కొన్న బయ్యర్‌ 70-80 శాతం లాస్‌ బేర్‌ చేయాల్సి వచ్చింది. యుఎస్‌ డిస్ట్రిబ్యూటర్‌ అయితే పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయాడు. సినిమాకు వచ్చిన వసూళ్లు పబ్లిసిటీ, థియేట్రికల్‌ రెంట్స్‌ ఇతర ఖర్చులకే సరిపోయిన పరిస్థితి. పెద్ద సినిమాలు ఫ్లాప్‌ అయినప్పుడు నష్టాలు మామూలే కానీ.. అఖిల్‌ సినిమా విషయంలో నష్టం భారీగా ఉంది. నెగెటివ్‌ టాక్‌ వేగంగా స్ప్రెడ్‌ కావడంతో రెండో రోజు నుంచే అఖిల్‌ కలెక్షన్లపై బాగా ప్రభావం పడింది. వీకెండ్‌ అయ్యాక సినిమా బాక్సాఫీస్‌ పరీక్షకు ఏమాత్రం నిలవలేకపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు