బన్నీ దేనికి.. టైమ్‌ వేస్ట్‌

బన్నీ దేనికి.. టైమ్‌ వేస్ట్‌

హిట్‌ ఇచ్చిన దర్శకుల్లో చాలా మంది వెంటనే ఒక అగ్ర హీరోతో సినిమా చేద్దామంటూ ఇతర ఆఫర్లన్నీ వదిలేసుకుంటారు. భలే భలే మగాడివోయ్‌తో భారీ హిట్‌ కొట్టిన మారుతికి కూడా ఆఫర్లు బాగా వచ్చాయ్‌. పెద్ద హీరోలు తనతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అర్జున్‌కి బాగా క్లోజ్‌ అయిన మారుతికి ఓ సినిమా చేస్తానంటూ బన్నీ మాటిచ్చాడట. బన్నీ కోసమని ఎదురు చూస్తూ కూర్చుంటే వచ్చే రెండేళ్లలో తనకి ఇంకో సినిమా వుండదనేది మారుతికి తెలుసు. అందుకే కాంక్రీట్‌గా బన్నీతో డీల్‌ కుదరనప్పుడు అతనికోసం టైమ్‌ వేస్ట్‌ చేసుకోవడం వేస్ట్‌ అని తనకి అందుబాటులో వున్న హీరోతో సినిమా చేసేస్తున్నాడు.

 భలే భలే మగాడివోయ్‌ తర్వాత ఫామ్‌లో వున్న యువ హీరోలెవరైనా మారుతికి దొరికేవారు. అయితే వారితో సినిమా అంటే చాలా టైమ్‌ వేస్ట్‌ అవుతుంది. అందుకే వెంకటేష్‌తో వెంటనే ఒక సినిమా మొదలు పెట్టేస్తున్నాడు. డిసెంబర్‌లో సెట్స్‌ మీదకి వెళుతోన్న ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్‌ అయిపోతుంది. సెప్టెంబర్‌లో భలే భలే మగాడివోయ్‌ విడుదలైతే కేవలం మూడు నెలల్లో మరో చిత్రం స్టార్ట్‌ చేసేస్తూ మారుతి బిజీగా వుంటున్నాడు. చాలా మంది యువ దర్శకులకి ఈ ప్లానింగ్‌ లేక కాలం వృధా చేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు