బెంగాల్‌ టైగర్‌ ఆడాలని ఆ డైరెక్టర్‌ ప్రార్థన

బెంగాల్‌ టైగర్‌  ఆడాలని ఆ డైరెక్టర్‌ ప్రార్థన

'స్వామి రారా' లాంటి సెన్సేషనల్‌ మూవీతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు సుధీర్‌  వర్మ. హీరోలు, ప్రొడ్యూసర్ల కాల్స్‌తో కొన్ని రోజుల పాటు అతడి ఫోన్‌ మోగుతూనే ఉంది. వచ్చిన అవకాశాలన్నీ పరిశీలించి.. నాగచైతన్య, బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ల కాంబినేషన్‌ ఓకే చేశాడు. కానీ స్వామి రారా సినిమానే అటు ఇటు మార్చి తీసిన 'దోచేయ్‌' దారుణమైన ఫలితాన్నివ్వడంతో కుర్ర డైరెక్టర్‌ పరిస్థితి తలకిందులైంది. అతడి కోసం ఎవరూ ట్రై చేయట్లేదు. అతనే వాళ్లూ వీళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

ఫ్లాప్‌ డైరెక్టర్లకు ఛాన్సులిచ్చి పైకి తీసుకొస్తాడని పేరున్న మాస్‌ రాజా రవితేజ కోసం సుధీర్‌ గట్టిగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. రవితేజ కోసం ఓ డ్యూయల్‌ రోల్‌ కథ ఒకటి రెడీ చేశాడట సుధీర్‌. తన 'రాబరీ' ఫార్మాట్‌ వదిలేసి ఇంకో భిన్నమైన కథే తయారు చేసినట్లు సమాచారం. ఐతే 'కిక్‌-2' తర్వాత మళ్లీ రిస్క్‌ చేసే స్థితిలో లేడు మాస్‌ రాజా. 'బెంగాల్‌ టైగర్‌' రిజల్ట్‌ చూశాక ఆలోచిద్దాం అని హోల్డ్‌లో పెట్టాడట. ఆ సినిమా హిట్టయితే సుధీర్‌కు ఛాన్స్‌ దక్కొచ్చు. కాబట్టి 'బెంగాల్‌ టైగర్‌' బాగా ఆడాలని ప్రార్థన చేస్తున్నాడట సుధీర్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English