బాహుబలి హిందీ రేటింగ్‌ పేలిపోయిందట

బాహుబలి హిందీ రేటింగ్‌ పేలిపోయిందట

టాలీవుడ్‌ రికార్డుల్నే కాదు.. భారతీయ చలనచిత్ర పరిశ్రమ రికార్డుల్ని కూడా వేటాడేశాడు 'బాహుబలి'. థియేట్రికల్‌ రన్‌ పూర్తయ్యాక వరుసగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతూ ప్రశంసలందుకుంది రాజమౌళి సినిమా. ఇప్పుడు బుల్లితెర మీద కూడా హవా సాగిస్తోంది. మొన్న దసరాకు తెలుగుతో పాటు హిందీలోనూ 'బాహుబలి'ని టీవీలో టెలికాస్ట్‌ చేశారు. తెలుగు ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపించారు కానీ.. ఇక్కడ టీవీ రేటింగ్‌ రికార్డును 'బాహుబలి' బద్దలు కొట్టలేకపోయింది. శ్రీరామదాసు, మగధీర తర్వాత మూడో స్థానంలో నిలిచింది బాహుబలి.

ఐతే బాహుబలి హిందీ వెర్షన్‌ కు తెలుగులో కంటే మిన్నగా స్పందన వచ్చిందంటున్నాడు ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్‌ చేసిన కరణ్‌ జోహార్‌. హిందీ టెలివిజన్‌ రేటింగుల రికార్డును బాహుబలి బద్దలు కొట్టిందని అతను ట్వీట్‌ చేశాడు. ఐతే రేటింగ్‌ ఎంత వచ్చిందన్న వివరాలు వెల్లడించలేదు. రాజమౌళి అండ్‌ టీమ్‌ కు మరింత పవర్‌ వచ్చిందని కరణ్‌ జోహార్‌ చెప్పాడు.  ఈ ట్వీట్‌ పై దగ్గుబాటి రానా స్పందిస్తూ.. కరణ్‌ కు థ్యాంక్స్‌ చెప్పాడు.'బాహుబలి' విజయంలో మీకూ భాగస్వామ్యం ఉందన్నాడు. బాహుబలి ఫస్ట్‌ పార్ట్‌ ను హిందీలో అద్భుతంగా ప్రమోట్‌ చేసి, భారీ స్థాయిలో విడుదల చేసిన కరణ్‌.. రిలీజ్‌ తర్వాత భారీ లాభాలు అందుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు