ఈరోస్‌తో మహేష్‌ భారీ డీల్‌!

ఈరోస్‌తో మహేష్‌ భారీ డీల్‌!

శ్రీమంతుడు తర్వాత మహేని  కేవలం కమర్షియల్‌ చిత్రాలు చేసే హీరోగా మాత్రమే కాకుండా, ఓ బాధ్యతగల పౌరుడిగా మహేష్‌ బాబుని అందరూ చూడటం మొదలుపెట్టారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.  మహేష్‌ బాబులో కూడా ఈ సినిమా భారీ మార్పు తెచ్చిందని తన చుట్టూ ఉన్నవారు  అంటున్నారు కూడా. బాగా డబ్బు సంపాదించాలి... ఆ డబ్బులో సగ భాగమైనా సమాజ సేవ కోసం ఉపయోగించాలనే  లక్ష్యంతో తో మహేష్‌ ఉన్నాడని తెలుస్తోంది.  సొంత బ్యానర్‌ 'యం.బి ఎంటర్‌ టైన్స్‌ మెంట్స్‌' ఆరంభించి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 'శ్రీమంతుడు' చిత్రంతోనే ఈ బ్యానర్‌ ఆరంభమయ్యింది. మహేష్‌ బాబు చేస్తున్న 'బ్రహ్మోత్సవం'కి కూడా మహేష్‌ బాబు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

కాగా ఈ మధ్య మహేష్‌ బాబు ఓ భారీ డీల్‌ ని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వారితో కుదుర్చకున్నాడని  తాజా సమాచారం. బాలీవుడ్‌ లో ఒకవైపు భారీ చిత్రాలు నిర్మిస్తూ మరో వైపు  పంపిణీ చేస్తూ దూసుకెళ్తోన్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ డిక్టేటర్‌ చిత్రంతో టాలీవుడ్‌లో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. మహేష్‌ బాబు హీరోగా రూపొందిన '1', 'ఆగడు', 'శ్రీమంతుడు' చిత్రాలను పంపిణీ చేసిన ఈ సంస్థ తాజాగా మహేష్‌ బాబుతో 300కోట్ల భారీ డీల్‌ ని కుదుర్చుకుందని వినికిడి.  మహేష్‌ బాబు నటిస్తూ, నిర్మించనున్న సినిమాలకు సంబంధించిన పంపిణీ హక్కులు ఈరోస్‌ సంస్థకు ఇచ్చేయాలట. ఎన్ని సినిమాలనే విషయం తెలియడంలేదు గానీ ఈ భారీ డీల్‌  కోసం మహేష్‌ బాబు, ఈ సంస్థ సి.ఇ.ఓలు మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగాయట. మరి మహేష్‌ సినిమాలనే మాత్రమే పంపిణీ చేయనుందా... లేక మహేష్‌ తో సినిమాలు కూడా ఈ సంస్థ నిర్మించనుందా?  అసలీ డీల్‌ వెనుక గల కారణాలు ఏంటీ అనేది క్లారిటీగా తెలియాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు