బెంగాల్‌ టైగర్‌కి షివరింగ్‌ స్టార్ట్‌

బెంగాల్‌ టైగర్‌కి షివరింగ్‌ స్టార్ట్‌

మూస పోకడులున్న సినిమాలని నిర్దాక్షిణ్యంగా తిప్పి కొడుతున్న ట్రెండ్‌ ఇప్పుడు నడుస్తూ వుండడంతో సోకాల్డ్‌ కమర్షియల్‌ డిష్‌లు సిద్ధం చేసిన వారికి టెన్షన్‌ స్టార్ట్‌ అయింది. కిక్‌ 2 దగ్గర్నుంచి అఖిల్‌ వరకు పెద్ద సినిమాల్ని కూడా ఆడియన్స్‌ దారుణంగా తిరస్కరించారు. ఇక ఇలాంటి మూస సినిమాలు చూసేదే లేదని తీర్మానించేసారు. దీంతో వెరైటీ సినిమాలతో వస్తున్న వారికి పట్టలేని ఆనందం, ఫార్ములాని నమ్ముకున్న వారికి తట్టుకోలేనంత భయం కలుగుతున్నాయి. రాబోయే పెద్ద సినిమాల్లో ఫార్ములాని పట్టుకుని తీసిన బెంగాల్‌ టైగర్‌ వుంది.

రచ్చ సినిమాకి పురాతన కాలం నాటి సక్సెస్‌ ఫార్ములా వాడి పాస్‌ అయిపోయిన సంపత్‌ నంది ఈసారి కూడా అలాంటి సినిమాతోనే వస్తున్నాడు. కానీ ప్రేక్షకులు వున్న మూడ్‌కి ఇప్పుడు బెంగాల్‌ టైగర్‌ అలరించగలదా అన్నదే అనుమానంగా కనిపిస్తోంది. ట్రెయిలర్‌ చూస్తే ఫక్తు మసాలా చిత్రమనేది క్లియర్‌గా తెలుస్తోంది. ఏమాత్రం రొటీన్‌ అనిపించినా అన్‌ సీజన్‌లో ఇబ్బందులు తప్పవు. అసలే రవితేజ గత చిత్రం కిక్‌ 2 మిస్‌ఫైర్‌ వుండడంతో టాక్‌ ఏ కొంచెం తేడాగా వచ్చినా టైగర్‌కేసి కూడా చూడరు. సంపత్‌ నంది మాత్రం తన ఫార్ములా ఎప్పుడూ మాస్‌ని అలరించగలదనే ధీమాతోనే వున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు