రిలీజ్‌ వాయిదా మంచే చేసింది!

రిలీజ్‌ వాయిదా మంచే చేసింది!

బలుపు, పవర్‌ లాంటి రెండు హిట్లతో మాస్‌ మహరాజ్‌ రవితేజ కేరీర్‌ ఆకాశాన్నంటింది. అయితే అంతే సడెన్‌గా కిక్‌ 2 డిజాస్టర్‌తో పాతాళంలోకి పడిపోయాడు. కిక్‌ 2 ఫ్లాప్‌ తర్వాత రవితేజ మార్కెట్‌ బాగా పడిపోయింది. సినిమాకు పెట్టిన బడ్జెట్‌తో పోల్చుకుంటే అందులో సగం వసూళ్లను కూడా కిక్‌ 2 రాబట్టలేకపోవడంతో రవితేజ సినిమాపై భారీగా ఇన్వెస్ట్‌ చేసేందుకు నిర్మాతలు, బయ్యర్లు ముందుకు రావడం లేదు. అయితే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా రవితేజను అదృష్టం తలుపు తట్టింది అనుకోవాలి.

ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో బెంగాల్‌ టైగర్‌ సినిమా చేస్తున్నాడు మాస్‌ రాజా. నవంబర్‌ 27న ఇది విడుదల కానుంది. ఇందులో రవితేజకు జోడీగా తమన్నా, రాశీఖన్నా నటించారు. ఈ సినిమాకు ముందు అనుకున్న స్థాయిలో బిజినెస్‌ జరగలేదు. అయితే సినిమా ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. సినిమా లేట్‌ అవుతున్న కొద్దీ బెంగాల్‌ టైగర్‌కు ఊహించిన దానకంటే భారీగా బిజినెస్‌ జరుగుతోంది.

ఈ సినిమా బడ్జెట్‌ 25 కోట్ల వరకు అయింతే థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.34 కోట్ల వరకు జరిగిందని సమాచారం. నైజాం రైట్స్‌ రూపంలోనే నిర్మాతకు 7.5 కోట్లు వచ్చాయని సమాచారం. ఇక మిగిలిన ఏరియాల్లోనూ ఆశాజనకంగానే బిజినెస్‌ జరిగింది. రచ్చ ఫేం సంపత్‌నంది కసితో ఈ సినిమా తీశాడన్న ప్రచారం జరగడంతోనే ఈ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్‌ జరిగిందని సమాచారం. అలాగే ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ను ఓ ప్రముఖ ఛానెల్‌ రూ.7 కోట్లకు దక్కించుకుందట. రవితేజ కేరీర్‌లోనే ఇది హయ్యస్ట్‌ శాటిలైట్‌ రేట్‌ కావడం విశేషం. ఈ సినిమా తర్వాత రవితేజ దిల్‌ రాజు బ్యానర్‌లో ఓ మై ఫ్రెండ్‌ ఫేమ్‌ వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో ఎవడో ఒకడు అనే సినిమాకు కమిటయ్యాడు. ఈ సినిమా తర్వాత హరీష్‌శంకర్‌ డైరెక్షన్‌లో నటించేందుకు కూడా ఓకే చెప్పాడు. ఈ సినిమాలు హిట్‌ అయితే రవితేజ మళ్లీ తిరిగి తన పూర్వపు ఫామ్‌ను అందుకుంటాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు