నిత్యా ఎన్నాళ్లకెన్నాళ్లకు..

నిత్యా ఎన్నాళ్లకెన్నాళ్లకు..

తెలుగులో సౌందర్య, లయ లాంటి వాళ్ల తర్వాత మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ నిత్యా మీననే. కేవలం తన యాక్టింగ్‌ మీద ఇష్టంతో జనాలు థియేటర్లకు వచ్చేలా చేయగలిగిన అరుదైన హీరోయిన్‌ నిత్యానే. తెలుగులో ఇలాంటి ఫాలోయింగ్‌ మరే హీరోయిన్‌ కూ లేదు. ఐతే తనకంత మంచి గుర్తింపు ఉంది కాబట్టే.. సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌ గా ఉంటుంది నిత్య. ఆమె హీరోయిన్‌ గా ఏడాదికో సినిమా రావడం కూడా కష్టంగా ఉంది. 2013లో గుండె జారి గల్లంతయ్యిందే లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత ఏడాదిన్నర పాటు మరో తెలుగు సినిమా విడుదల కాకపోవడం విశేషం.

ఈ ఏడాది నిత్య తెలుగులో హీరోయిన్‌ గా నటించిన సినిమా 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' మాత్రమే. సన్నాఫ్‌ సత్యమూర్తి, రుద్రమదేవి లాంటి సినిమాల్లో నటించినా అవి చిన్న పాత్రలే. మళ్లీ చాలా గ్యాప్‌ తర్వాత ఆమె తెలుగులో హీరోయిన్‌ గా ఓ సినిమా చేయబోతోంది. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కుతున్న 'ఆ ఒక్క అమ్మాయి తప్ప' అనే సినిమాలో నిత్యానే హీరోయిన్‌. సందీప్‌ తో నిత్య చేయబోతున్న తొలి సినిమా ఇదే. 'రుద్రమదేవి'కి మాటలు అందించిన రాజసింహ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు